CWC Reservoirs : దేశంలో పెరిగిన ‍ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం..

భారత దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో ఎక్కడి వెళ్లిన.. ఏ మూలకు వెళ్లి అక్కడ చల్లని వాతావరణ, తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇలా దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 10, 2024 | 03:25 PMLast Updated on: Jul 10, 2024 | 3:25 PM

The Water Level Of The Main Reservoirs In The Country Has Increased

భారత దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో ఎక్కడి వెళ్లిన.. ఏ మూలకు వెళ్లి అక్కడ చల్లని వాతావరణ, తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇలా దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రతి రాష్ట్రంలో వాగులు.. వంకలు.. నదులు.. డ్యామ్లు.. ఇలా అన్ని కూడా నీటితో నిండి కలకలలాడుతున్నాయి.

ఇక విషయంలోకి వెళితే…

దేశంలో వర్షాలు ప్రతి రాష్ట్రంలో.. జలకళ సంతరించుకుంటుంది.
గత కొన్ని రోజులుగా.. వాయువ్య – ఈశాన్య భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాధిలో జమ్మూ నుంచి సిక్కింగ్ వరకు.. దక్షిణాదిలో ముంబై నుంచి కేరళ.. తమిళనాడు నుండి వెస్ట్ బెంగాళ్ ఇలా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వర్షం కురుస్తునే ఉంది. దీంతో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఓ శుభవార్త చెప్పింది.

దేశంలో భారీ వర్షాలు కురుస్తున్న.. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టం తొలిసారిగా పెరిగిందని పేర్కొంది. భారతదేశంలోని 150 రిజర్వాయర్ ను పర్యవేక్షించే సీడబ్ల్యూసీ తాజా సమాచారాన్ని మీడియాకు వెల్లడించింది. గతవారం కంటే నీటి మట్టం 2 శాతం పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం నిల్వ సామర్థ్యం 73 శాతంగా ఉందని వెల్లడంచింది. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 35.30 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్టు తెలిసిందే. ఈ రిజర్వాయర్లలో 22 శాతం నీటితో నిండి ఉండి ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 56 రిజర్వాయర్లలో నీటి నిల్వ స్థాయిలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు.. మరో 61 రిజర్వాయర్లలో సాధారణ నీటి నిల్వలు ఉన్నట్లు.. వాటి స్థాయి కూడా పెరుగుతుందని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా నీటి నిల్వలు ఉన్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.
అసోం, జార్ఖండ్, త్రిపుర, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, కేరళ లో గత సంవత్సరం కంటే మెరుగైన నీటి నిల్వలు ఉన్నాయంది. రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో గతేడాది కన్న తక్కువవగా నీటి నిల్వలు ఉన్నట్లు పేర్కొంది.