Twitter Beauty: సాఫ్ట్ వేర్ యువకులు.. సోషల్ మీడియా యువతి.. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసా..?

పెళ్లిళ్లు ఒకప్పడు స్వర్గంలో నిర్ణయించబడతాయి అనేవారు. ఎందుకంటే పెళ్లికి అంతటి పవిత్రత, విశిష్టత అప్పట్లో ఉండేదని పెద్దలు భావించేవారు. కానీ ఇప్పుడంతా ఆన్ లైన్ యుగం. ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అన్నట్లు మెయిల్ పెట్టు జత కట్టు అనేలా ట్రెండ్ మారిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూస్తే మీరు షాక్ కాదు షేక్ అవుతారు. ఒక యువతి తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం నెటిజన్లకి పరీక్ష పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 19, 2023 | 07:45 PMLast Updated on: Jul 19, 2023 | 7:45 PM

The Young Woman Posted A Request To The Netizens On Twitter To Select A Groom For Her

పెళ్లి చేసి చూడు, ఇళ్ళు కట్టి చూడు ఇది నాటి సామెత. ఈ కాలంలో దీనిని సగానికి తెగ్గొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మూడు పదుల వయసు దాటినా పెళ్లిళ్లకు నో అంటున్నారు నేటి యువత. అది అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా. దీనికి కారణాలు వారివారి అలవాట్లు, అభిరుచులకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఇది కాదు అసలు విషయం. తన పెళ్లికి మొగుడ్ని వెతికిపెట్టడం ప్రదాన అంశం. సాధారణంగా పెళ్లికి మంచి సంబంధాలు కోసం కొందరు తెలిసిన వారిని సంప్రదిస్తారు. ఇది అనాదిగా వస్తున్న తంతు. రెండు దశాబ్ధాల క్రితం పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించి చక్కని జోడీని చూడమని అడిగేవారు. ఇది నేడు అవుట్ డేటెడ్ వర్షన్ లా మారిపోయింది. దశాబ్ధం నుంచి సరికొత్త ట్రెండ్ అమల్లోకి వచ్చింది. అదే తమంతట తామే షాదీ వెబ్ సైట్లలో లాగిన్ అవుతున్నారు. మాట్రీమోనీలను సంప్రదించి తమ పూర్తి వివరాలు అందిస్తున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.

ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు ఒక యువతి. ఈమె బీకాం చదివి ఇంట్లో ఉండి మంచి చెడ్డా చూసుకుంటున్నారట. ఈ సోషల్ మీడియా బ్యూటీ వయసు 29 ఏళ్లు. పెళ్లి కోసం తన ప్రొఫైల్ ని మ్యాట్రిమోనీ సైట్లో అప్లోడ్ చేసినట్లు చెప్పారు. ఇంకేముంది.. అసలే కరువు కాలం. కరోనా నుంచి కోలుకున్న లోకం. ఐటీ పుణ్యమా అంటూ ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఐదంకెల జీతం తీసుకుంటున్న దేశం. వీకెండ్ పార్టీలు, నెలకు 20 రోజుల పనిదినాలు. రెండేళ్లలోప్రమోషన్లు, ఫారిన్ ట్రిప్పులు, ప్రాశ్చాత్య పోకడలు. ఇలా ఒకటా రెండా జీవితంలో కావల్సినంత ఆనందానికి పదిరెట్లు ఎక్కువగానే అనుభవిస్తున్నారు. ఈ ఆనందాల తీరంలో విహరించే రాజుకి ఒక రాణి తోడు కావాలి కదా. ఒంటరిగా ఎంతకాలం తిరుగుతారు. ఇంట్లో వాళ్లను ఎదో ఒకటి చెప్పి పెళ్లి విషయంలో నోరు మూయించవచ్చు. సమాజం నోటికి తాళం వేయలేరు కదా. అందుకే ఏం చేశారో ఇప్పుడు చూద్దాం.

మ్యాట్రిమోని సైట్లో ప్రొఫైల్ పోస్ట్ చేసిన యువతి చుట్టూ తిరుగుతున్నారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందో లేదో తెలియదు కానీ.. సాప్ట్ వేర్ ఉద్యోగులు మాత్రం ఈ అమ్మాయి చుట్లూ తిరుగుతున్నారు. బైజూస్ మొదలు ఫ్లిప్ కార్ట్ వరకూ.. డెలాయిట్ మొదలు టీసీఎస్ వరకూ అందరూ తెగ ఎగబడుతున్నారు. వీరి శాలరీల విషయానికి వస్తే ఒక్కొక్కరు ఏడాదికి కనిష్టంగా రూ. 14 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకూ సంపాదిస్తున్న వారే కావడం గమనార్హం. ఇలా పోటీపడ్డవారి లిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఒక సందేశాన్ని రాసుకొచ్చింది ట్విట్టర్ పోరి. ‘నా పెళ్లి గురించి మాట్రిమోనీలో అప్లోడ్ చేస్తే 14 మంది యువకులు నాతో కాంటాక్ట్ లోకి వచ్చారు. వీరిలో ప్రతి ఒక్కరితో వేర్వేరుగా నేను తరచూ మాట్లాడుతున్నాను. ఎవరిని పెళ్ళి చేసుకోవాలో అర్థం కావడంలేదు. నాకు ఒక చిన్న సహాయం చేయండి. నేను ఫుల్ కన్ఫూజన్లో ఉన్నాను. ఈ లిస్ట్లో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీరే చెప్పండి’ అంటూ నెటిజన్లను అభ్యర్థించారు.

ఈ విధమైన ట్వీట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కొందరు స్పందిస్తూ నీకు 29 ఏళ్లు ఉన్నప్పుడు ఖాళీగా ఎందుకు ఉన్నావు అని ఒకరు ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది ప్రస్తుతం ఐటీ రంగం ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితుల్లో ఉంటే ఇన్ని లక్షల్లో జీతాలు ఎవరిస్తున్నారు అని నిలదీస్తున్నారు. మరి కొంత మంది ఇది ఫేక్ అకౌంట్, తప్పుడు న్యూస్ అంటూ కొట్టిపడేస్తున్నారు.

T.V.SRIKAR