Rao’s coaching Centers : రావుస్ కోచింగ్ సెంటర్‌లో జరిగింది ఇదీ ! ఎవరికీ తెలియని నిజాలు
ఐఏఎస్ (IAS) అవ్వాలని వాళ్లు కన్న కలలు వరదల్లో కొట్టుకుపోయారి. పరిపాలనలో భాగం కావలన్న వాళ్ల తపన సెల్లార్‌లోనే సమాధి ఐపోయింది.

Their dreams of becoming an IAS were swept away in the flood. Their desire to be a part of the administration was buried in the cellar itself.
ఐఏఎస్ (IAS) అవ్వాలని వాళ్లు కన్న కలలు వరదల్లో కొట్టుకుపోయారి. పరిపాలనలో భాగం కావలన్న వాళ్ల తపన సెల్లార్‌లోనే సమాధి ఐపోయింది. దేశ రాజధాని (National Capital) ఢిల్లీలో ముగ్గురు విద్యార్థుల మృతి ఇప్పుడు ఢిల్లీలో అనేక ఆందోళనలకు కారణమవుతోంది. ఢిల్లీలో రావుస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ (Rao’s Civils Coaching Centre) సెల్లార్‌లో వరద నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశమంతా చర్చనీయాంశమైంది. తాన్యా సోనీ (Tanya Soni), శ్రేయా యాదవ్ (Shreya Yadav), నవీన్ డాల్విన్ (Naveen Dalvin) ముగ్గురూ ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో ఉన్న రావుస్ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. శనివారం కురిసిన భారీ వర్షానికి రావుస్ కంప్యూటర్ సెల్లార్‌లోకి భారీగా వరద నీరు చేసింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో సెల్లార్‌లో చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కసారిగా వరద ముంచుకు రావడంతో అంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ శ్రేయా, సోనీ, నవీన్ మాత్రం నీళ్లలో చిక్కుకుపోయారు. అప్పటికే సెల్లార్ నిండా నీళ్లు చేరేడంతో వాళ్లను కాపాడటం తోటి విద్యార్థులకు సాధ్యం కాలేదు. వెంటనే ఎన్డీఆర్ బృందానికి పోలీసులకు ఫోన్ చేశారు. కానీ సహాయక బృందాలు అక్కడి వచ్చేటప్పికే ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. సోనియా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో బొగ్గుగని మేనేజర్‌గా పని చేస్తున్నారు. నవీన్ కేరళకు చెందని వ్యక్తి కాగా శ్రేయా యాదవ్ బిహార్‌కు చెందిన యువతి.
ఈ ముగ్గురు వ్యక్తుల మృతితో తోటి విద్యార్థులు రోడ్డెక్కారు. నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న రావుస్ కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు తీసుకుని సెల్లార్‌లో లైబ్రరీ ఏర్పాటు చేశారని మండి పడుతున్నారు. వెంటనే నిందితులకు శిక్షపడాలి, మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు కూడా ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని విద్యార్థులు నిరసనకు దిగారు.