T20, India win Dhoni, Kohli : అప్పుడు ధోని.. ఇప్పుడు కోహ్లీ.. సేమ్ టు సేమ్‌…

17ఏళ్ల తర్వాత టీ20 వాల్డ్‌కప్‌ నెగ్గింది టీమిండియా. నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో సౌతాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన.. విజయం అందుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 30, 2024 | 01:35 PMLast Updated on: Jun 30, 2024 | 1:35 PM

Then Dhoni Now Kohli Same To Same

 

 

17ఏళ్ల తర్వాత టీ20 వాల్డ్‌కప్‌ నెగ్గింది టీమిండియా. నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో సౌతాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన.. విజయం అందుకుంది. భారత్‌ విజయంలో ఇద్దరిదే కీలక పాత్ర. బ్యాటింగ్‌లో కోహ్లీ.. బౌలింగ్‌లో బుమ్రా. ఈ ఇద్దరే తమ అద్భుత ప్రదర్శనతో భారత్‌ మళ్లీ కప్‌ను ముద్దాడేలా చేశారు. వరసగా వికెట్లు పడుతున్న సమయంలో.. క్రీజ్‌లో పాతుకుపోయిన కోహ్లీ ప్రొటీజ్ బౌలర్లను రఫ్ఫాడించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో 76 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐతే నిజానికి ఈ టోర్నీ అంతా విరాట్‌ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.

ఈ ఐపీఎల్‌లో 15 ఇన్నింగ్స్‌లో 741 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ కొట్టిన కోహ్లీ.. వాల్డ్‌కప్‌ వచ్చేసరికి ఫెయిల్ అయ్యాడు. వాల్డ్‌కప్‌లో 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 75 రన్స్‌ మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీ సెల్ఫిష్ ప్లేయర్ అంటూ కామెంట్లు వినిపించాయ్. ఐతే విరాట్‌కు కెప్టెన్‌ రోహిత్ అండగా నిలిచాడు. ఫైనల్స్ కోసం రన్స్ సేవ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే ఫైనల్‌ ఫైట్‌లో విరాట్‌.. తన స్టామినా ఏంటో చూపించాడు. ఐతే ధోనితో కోహ్లీ కంపారిజిన్ స్టార్ట్ అయింది. 2011లో భారత్ వన్డే ప్రపంచకప్‌ నెగ్గింది. ఫైనల్‌లో ధోని 91 పరుగులు చేసి.. జట్టుకు కప్ అందించాడు.

ఆ టోర్నీ అంతా ఫెయిల్ అయిన ధోని.. ఫైనల్‌లో మాత్రం సూపర్ క్లిక్ అయ్యాడు. గంభీర్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. టీమిండియాకు 28ఏళ్ల తర్వాత వాల్డ్‌కప్‌ అందించాడు. ఇప్పుడు కోహ్లీ కూడా అలానే కనిపించాడు. టోర్నీ మొత్తం ఫెయిల్ అయిన కోహ్లీ.. ఫైనల్‌లో మాత్రం విరుచుకుపడ్డాడు. 76 పరుగులతో అదరగొట్టాడు. దీంతో అప్పుడు ధోని.. ఇప్పుడు కోహ్లీ.. సేమ్ టు సేమ్ అంటూ ఇద్దరి ఇన్నింగ్స్ షేర్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్‌.