YS Jagan : అప్పుడు జగన్.. ఇప్పుడు ట్రంప్.. ఎన్నికల ముందు దాడులు కలిసివస్తాయా?
సింపథీ క్రియేట్ చేసి మ్యాజిక్ రాజకీయాల్లో ఎలా ఉంటుందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సింపథీ చాలామందిని పీఠం ఎక్కించింది. చాలామందిని పీఠం నుంచి దించింది.

Then Jagan.. Now Trump.. Will the attacks come together before the election?
సింపథీ క్రియేట్ చేసి మ్యాజిక్ రాజకీయాల్లో ఎలా ఉంటుందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సింపథీ చాలామందిని పీఠం ఎక్కించింది. చాలామందిని పీఠం నుంచి దించింది. అమెరికాలోనూ ఇదే జరగబోతుందా.. అవకాశాలు మాత్రం కచ్చితంగా కనిపిస్తున్నాయ్. అమెరికా అధ్యక్ష రేసు హాట్‌హాట్‌గా సాగుతోంది. అటు ట్రంప్, ఇటు బైడెన్.. ప్రచారంలో తగ్గేదే లే అనిపిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లు ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో.. ఓ ఘటన అమెరికా రాజకీయాలను పూర్తిగా మార్చేసినట్లు కనిపిస్తోంది.. అదే ట్రంప్ మీద బుల్లెట్ ఎటాక్ ! ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది. ట్రంప్ చెవి చివరి నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో… ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తన చెవికి బుల్లెట్ తగిలినా.. ట్రంప్ భయపడకుండా పిడికిలి బిగించి పోరాట యోధుడిలా పోజులిచ్చారు. దాంతో అటుఇటుగా ఉన్న ట్రంప్ విజయావకాశాలు పెరిగిపోయాయ్.
మొహం మీద రక్తం కారుతుంటే.. జనం వైపు చూస్తూ ట్రంప్ పిడికిలి బిగించడం… సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌లు ఆయనను హడావుడిగా స్టేజ్ మీద నుంచి కిందికి దింపడంలాంటి పరిణామాలు.. ఒక చరిత్రగానే కాదు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార తీరును మార్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. అప్పుడు జగన్,.. ఇప్పుడు ట్రంప్.. ఒకరు లోకల్.. ఇంకొకరు ఇంటర్నేషనల్.. పర్సన్ వేరైనా ప్రాంతం వేరైనా.. ఒక్క సంఘటన మొత్తం సీన్‌ను మార్చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు జగన్ మీద ఇలాంటి దాడే జరిగింది.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న.. జగన్ మీద వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో కోడి కత్తితో దాడి చేశారు. ఆ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ రోజుకు జగన్ చేస్తున్న పాదయాత్ర 294వ రోజుకు చేరుకుంది. విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకున్నారు. ఈ సమయంలో ఆ విమానాశ్రయం క్యాంటీన్‌లో పనిచేస్తున్న శ్రీను.. సెల్ఫీ తీసుకుంటానని వచ్చి జగన్ మీద దాడి చేశారు. శ్రీను జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది పక్కనపెడితే.. ఆ ఘటన మాత్రం వైసీపీ ఫేట్ మార్చేసింది. జగన్ మీద ఎక్కడలేని సింపథీ క్రియేట్ చేసింది. 151 సీట్లతో అధికారంలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ట్రంప్ విషయంలోనూ అదే జరుగుతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ట్రంప్ విజయావకాశాలు ఒక్కసారిగా పెరిగిపోయాయ్.
ఇప్పుడు యూఎస్ అంతా ఈ ఎటాక్ గురించే మాట్లాడుకుంటోంది. ఈ వయసులో పాపం ట్రంప్ అంటూ ఓటర్లు ఆయన వైపు మొగ్గుతున్నారు. సింపథీ ఫ్యాక్టర్ మాత్రమే కాకుండా.. ప్రత్యర్థిని కార్నర్ చేసే ఓ అంశం దొరుకుతుంది ఇలాంటి ఘటన వల్ల. అప్పుడు ఇక్కడ జగన్.. ఇప్పుడు అక్కడ ట్రంప్‌కు ప్లస్ అయ్యేది అదే ! ఈ ఘటనకు, హింసకు బైడెన్‌దే బాధ్యతని ట్రంప్ సన్నిహితులు, మద్ధతుదారులు విమర్శలు మొదలుపెట్టారు. ఈ ఘటన దేశంలో పెరుగుతున్న హింసకు నిదర్శనం అంటూ ఊదరగొడుతున్నారు. ఇలా ఎన్నికల ముందు దాడులు.. కలిసి వచ్చే చాన్స్ ఉంది. అప్పుడు జగన్ విషయంలో జరిగింది.. ఇప్పుడు ట్రంప్ విషయంలో రిపీట్ అవడం ఖాయమనే చర్చ మొదలైంది.