YS Jagan, KCR : అప్పుడు కేసీఆర్‌ ఇప్పుడు జగన్‌.. ఓడిపోయారు.. హాస్పిటల్‌ బెడ్‌ ఎక్కారు

ఏపీ మాజీ సీఎం జగన్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఎక్కువ సేపు నిలబడి ఉండటం కారణంగా కాళ్ల వాపులు వచ్చినట్టు డాక్టర్లు చెప్తున్నారు. కొన్ని రోజుల పాటు ఆయన రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సీన్‌ తెలంగాణ పాలిటిక్స్‌లో కూడా జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 23, 2024 | 02:00 PMLast Updated on: Jun 23, 2024 | 2:00 PM

Then Kcr And Now Jagan Lost Got On The Hospital Bed

ఏపీ మాజీ సీఎం జగన్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఎక్కువ సేపు నిలబడి ఉండటం కారణంగా కాళ్ల వాపులు వచ్చినట్టు డాక్టర్లు చెప్తున్నారు. కొన్ని రోజుల పాటు ఆయన రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సీన్‌ తెలంగాణ పాలిటిక్స్‌లో కూడా జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కొత్త అసెంబ్లీ ఏర్పాటైన వెంటనే మాజీ సీఎం కేసీఆర్‌ కాలు జారి పడిపోయారు. తయనకు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ ఆపరేషన్‌ కూడా జరిగింది.

దీంతో చాలా రోజులు ఆయన మంచానికే పరిమితమయ్యారు. అసెంబ్లీకి కూడా రాలేదు. అయితే కేసీఆర్‌ కావాలనే అసెంబ్లీకి రాలేదని.. వస్తే కాంగ్రెస్‌ చేసే విమర్శలు తట్టుకోలేక దూరంగా ఉన్నారని చాలా మంది విమర్శించారు. ఇప్పుడు జగన్‌ విషయంలో కూడా అదే జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కూడా దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును, టీడీపీ నేతలను తిట్టని తిట్టు లేదు. కానీ ఇప్పుడు వాళ్లెవరూ అసెంబ్లీలో లేరు. జగన్‌ మాత్రమే ఉన్నారు. గెలిచిన 11 మంది కూడా పెద్దగా ఫేమస్‌ కాదు.

దీంతో ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో జగన్‌కు ర్యాగింగ్‌ మామూలుగా ఉండదు. ఆ పార్టీ ఎఎమ్మెల్యేలకు పడాల్సిన కోటింగ్‌ కూడా అసెంబ్లీలో జగన్‌కు సోలోగా పడుతుంది. ఇలాంటి టైంలో జగన్‌ అస్వస్థతకు గురి కావడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. జగన్‌ కూడా అసెంబ్లీకి రావొద్దు అనుకునే.. ఇలా అనారోగ్యం పేరుతో నాటకాలాడుతున్నారంటూ ఓ వర్గం సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఇంతకాలం లేని కాళ్ల నొప్పులు, కాళ్ల వాపులు ఇప్పుడే వచ్చాయా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. నిజంగా జగన్‌ ఆరోగ్య పరిస్థితి ఏంటి.. రెస్ట్‌ అవసరమా అన్న విషయం పక్కన పెడితే.. అసెంబ్లీకి వస్తే ఓ బాధ రాకపోతే ఇంకో బాధ అన్నట్టుగా మారిపోయింది జగన్‌ పరిస్థితి.