AYODHYA BJP : భక్తులు లేరు..విమానాలు బంద్.. అయోధ్యలో ఏం జరుగుతోంది ?
అయోధ్య రాముడిని (Ayodhya Ram) బీజేపీ (BJP) ఎంత హైప్ చేసింది. రామాలయం నిర్మాణం దగ్గర నుంచి విగ్రహ ప్రతిష్ట... అంతకంటే ముందు బీజేపీ నేతలు... ఇంటింటికీ అక్షింతలు పంచడం... ఫోటోలను అందించడం.... బీజేపీ లేకపోతే రాముడు లేడు అన్నంత బిల్డప్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు.
అయోధ్య రాముడిని (Ayodhya Ram) బీజేపీ (BJP) ఎంత హైప్ చేసింది. రామాలయం నిర్మాణం దగ్గర నుంచి విగ్రహ ప్రతిష్ట… అంతకంటే ముందు బీజేపీ నేతలు… ఇంటింటికీ అక్షింతలు పంచడం… ఫోటోలను అందించడం…. బీజేపీ లేకపోతే రాముడు లేడు అన్నంత బిల్డప్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈసారి అయోధ్య ఇష్యూ బాగా ఓట్లు తెచ్చిపెడుతుంది… 400 సీట్లు కొట్టొచ్చని ఆశించారు. కానీ సీన్ రివర్స్ అయింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ (Faizabad, Parliament) సీటులోనే బీజేపీ ఓడిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోనూ సమాజ్ వాదీ పార్టీకి బాగానే ఎంపీ సీట్లు వచ్చాయి. హిందూత్వ భావానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకున్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ బొక్కబోర్లాపడింది. చివరకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోడానికి మిత్ర పక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది. దాంతో జూన్ 4 ఫలితాల తర్వాత రాముడి గురించి మాట్లాడమే మానేశారు బీజేపీ లీడర్లు. ప్రధాని నరేంద్రమోడీ కూడా రాముడి పేరు పలకడం లేదు. ఒడిశాలో బీజేపీ సర్కార్ అధికారంలోకి రావడంతో… ఇప్పుడు కొత్తగా జై జగన్నాథ్ మంత్రం అందుకున్నారని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. రాముడిని పూర్తిగా వదిలేశారని విమర్శిస్తున్నారు.
అయోధ్యలో కూడా గందరగోళం నడుస్తోంది. అక్కడ విశాలమైన రామాలయం నిర్మాణంతో పాటు….. రైల్వే, ఎయిర్ పోర్ట్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద టెంపుల్ టూరిజయంలో అయోధ్య ఒకటిగా నిలుస్తుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతం రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఉన్న రష్ ఇప్పుడు కనిపించట్లేదు. చిరు వ్యాపారుల బిజినెస్ కూడా బాగా పడిపోయింది. అప్పట్లో దేశవ్యాప్తంగా చాలామంది భక్తులు అయోధ్యకు వెళ్ళి రాముడిని దర్శించుకున్నారు. దాంతో రిక్ష, ఆటో కార్మికుడి నుంచి చిరు వ్యాపారి దాకా అందరికీ మంచి ఉపాధి దొరికింది. గతంలో కిట కిటలాడిన రామ మందిరం, హనుమాన్ గఢీల్లో ఇప్పుడు జనమే కనిపించడం లేదు. హైదరాబాద్ తో పాటు చాలా ఏరియాల నుంచి అయోధ్యకు వెళ్ళే విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నారు.
15, 20 రోజుల్లో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది… అయోధ్యలో ఏం జరుగుతుందన్న ఆందోళన మొదలైంది. అయితే అయోధ్య ఉన్న ఫైజాబాద్ ఎంపీ సీటులో బీజేపీ ఓడిపోవడంతోనే ఈ ఎఫెక్ట్ పడినట్టు చెబుతున్నారు. బీజేపీని ఓడించారంటూ అయోధ్య ప్రజలకు వ్యతిరేకంగా ఆన్ లైన్ క్యాంపెయిన్ నడుస్తోంది. రిజల్ట్స్ వచ్చిన రోజునే అక్కడి ప్రజలపై ఆన్ లైన్ లో సైబర్ పోలీసులకు భారీగా ఫిర్యాదులు వచ్చాయట. పైగా అయోధ్యలో స్థానికులు, వ్యాపారుల నుంచి ఎలాంటి వస్తువులు కొనవద్దని హిందువులు ప్రచారం చేస్తున్నారు. హిందూత్వ పార్టీకి ఓటు వేయనందున అక్కడి వాళ్ళకి ఏ సాయం చేయొద్దని క్యాంపెయిన్ చేస్తున్నారు. బాలరాముడికి ఇంతగా ప్రొజెక్ట్ చేసుకున్న బీజేపీ ఫైజాబాద్ లో ఎందుకు ఓడిపోయింది. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. జనరల్ సీట్ అయిన అయోధ్యలో పాసీ దళిత్ వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడం బీజేపీ చేసిన అతి పెద్ద తప్పు అంటున్నారు. యూపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, సిట్టింగ్ ఎంపీ మీద కోపం లాంటి కారణాలతోనే బీజేపీ ఓడిపోయినట్టు చెబుతున్నారు. బీజేపీ ఓడిపోతే ఆ కోపం ఫైజాబాద్, అయోధ్య ప్రజల మీద ఎందుకు చూపిస్తున్నారు. ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తల నుంచి వస్తోంది. అక్కడి ప్రజలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అయోధ్య, రామమందిరం అనేవి బీజేపీ, RSSకి ఎప్పటికీ ఎజెండా కాదు. వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే రాముడి వాడుకుంటారని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.
అయోధ్యలో అభివృద్ధి పనులు ఆగిపోతాయన్న టాక్ నడుస్తోంది. దాంతో చాలామంది అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏ విధంగానూ ఓట్లు తెచ్చిపెట్టని అయోధ్యను బీజేపీ నిజంగానే పక్కనపెట్టేస్తుందా ? ఇక కొత్తగా నిర్మాణాలను చేపట్టదా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అయోధ్యకు సీతమ్మ వారి శాపం వల్లే బీజేపీ ఓడిపోయిందనీ… అక్కడి ప్రజలకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయన్న టాక్ కూడా నడుస్తోంది.