YS Sharmila : తండ్రి కొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరు.. వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రం (Telangana Elections) ఏర్పడక ముందు వేళ్లలో ఉండే రాష్ట్రం అప్పులు.. కేసీఆర్ అధికారంలో 4 లక్షల కోట్ల అప్పులోకి నెట్టి దివాలా తీయించి.. కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని చెప్పి పనికి రాని ప్రాజెక్టు కట్టి రూ. లక్ష కోట్లు కాజేశారు.

There are no more traitors of Telangana than father and son.. YS Sharmila
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) పై నిప్పులు చెరిగిన వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల (YS Sharmil).. తెలంగాణ అభివృద్దిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు అన్నారు షర్మిల. మీ తండ్రీ కొడుకులను మించిన తెలంగాణకు ఇంక పెద్దర ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై షర్మిల మండిపడ్డారు. మీ మల్లి నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను కొల్లగొట్టేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి తమ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్సాటీపీ అధ్యక్షురాలు షర్మిల.
Mukesh Ambani : ముఖేష్ కి బెదిరింపు కేసులో మరో యువకుడు అరెస్ట్..
తెలంగాణ రాష్ట్రం (Telangana Elections) ఏర్పడక ముందు వేళ్లలో ఉండే రాష్ట్రం అప్పులు.. కేసీఆర్ అధికారంలో 4 లక్షల కోట్ల అప్పులోకి నెట్టి దివాలా తీయించి.. కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని చెప్పి పనికి రాని ప్రాజెక్టు కట్టి రూ. లక్ష కోట్లు కాజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా మని హామీనిచ్చి 10 ఏళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు కూడా భర్తి చేయలేకపోయింది ఈ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తి చేసింది.నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాధించిన ప్రత్యేక రాష్ట్రం నిధులు మీ ఖజానాకే.. నీళ్లు మీ ఫాంహౌస్ కే.. నియామకాలు మీ ఇంట్లోనే పరిమితం చేశారు అంటూ విమర్శించారు షర్మిల.