BRS Party: ఒక్క ఛాన్స్.. ఒకటో లిస్ట్.. ఈ శ్రావణమాసంలోనే క్లారిటీ !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్​, హరీశ్‌రావు సుదీర్ఘ కసరత్తు తర్వాత తొలి విడతలో అసెంబ్లీ టికెట్స్ ఎవరెవరికి అనౌన్స్ చేయాలనేది డిసైడ్ చేశారని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 15, 2023 | 08:33 PMLast Updated on: Aug 15, 2023 | 8:33 PM

There Are Reports That The First List Of Brs Party Mla Ticket Has Been Prepared

అదిగదిగో శ్రావణమాసం.. అనగానే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదిరిపోతున్నారట. వారికి ఎందుకా టెన్షన్ ? అంటే.. వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను శ్రావణమాసంలో మంచి ముహూర్తం చూసుకొని రిలీజ్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారట. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్​, హరీశ్‌రావు సుదీర్ఘ కసరత్తు తర్వాత తొలి విడతలో అసెంబ్లీ టికెట్స్ ఎవరెవరికి అనౌన్స్ చేయాలనేది డిసైడ్ చేశారని తెలుస్తోంది. ఫస్ట్ లిస్టులో ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాల పరిధిలోని కొన్ని కీలక అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందనే లీకులు వస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని టికెట్ పై డౌట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు, పలువురు ఎంపీలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగిన నేతలు, వ్యాపారవేత్తలు హైదరాబాద్ లో మకాం వేసి తమతమ రేంజ్ లలో టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పెద్దల వద్దకు వెళ్లి.. ఒక్క ఛాన్స్ ఇస్తే తామేంటో నిరూపించుకుంటామంటూ నమ్మకం కలిగించే మాటలు మాట్లాడుతున్నారని తెలుస్తోంది.అభ్యర్థిపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న అభిప్రాయం, సామాజిక, రాజకీయ సమీకరణాలు, ఇతర పార్టీల పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ల కేటాయింపు జరుగుతుందని బీఆర్ఎస్ పెద్దలు వారికి నచ్చజెప్పుతున్నారట.

ఫస్ట్ లిస్టులో 80 మంది పేర్లేనా ?

2018 సంవత్సరంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలప్పుడు తొలివిడతలోనే 105 మంది అభ్యర్థుల పేర్లను గులాబీ బాస్ ప్రకటించారు. అయితే ఈసారి ఫస్ట్ లిస్టులో 80 మంది అభ్యర్థుల పేర్లే ఉంటాయని అంటున్నారు. అయితే ఫస్ట్ లిస్టులో తమ పేరు ఉంటుందా ? ఒకవేళ లేకుంటే ..రెండో లిస్టులో పేరు ఉండే ఛాన్స్ ఎంత ? అనే దానిపై
టికెట్ విషయంలో డౌట్ ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు. టికెట్ రాకుంటే.. ఏం చేయాలనే దానిపై కూడా కొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫుల్ క్లారిటీతో ఉన్నారట. అయితే అంతదూరం ఆలోచించకుండా ఇప్పటికైతే ఫస్ట్ లిస్టులో తమ పేరును చేర్చుకొని భరించలేని ఆ టెన్షన్ నుంచి బయటపడాలని వాళ్లు భావిస్తున్నారట. ఇక ఇప్పటికే పలు సభలు, సమావేశాల సందర్భంగా దాదాపు 18 మందికి టికెట్లు ఖరారవుతాయనే సంకేతాలను బీఆర్ఎస్ ప్రజల్లోకి పంపింది.

ఉమ్మడి వరంగల్ లో ఐదుగురు సిట్టింగ్ లకు నో ?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పోటీ ఉండటంలో శ్రీహరిని అసెంబ్లీకి.. రాజయ్యను లోక్ సభకు పంపే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఎంపీ పసునూరికి ఎమ్మెల్సీ ఇస్తారని సమాచారం. మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి సత్యవతి రాథోడ్ ను బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎంపీగా ఒక ఐఏఎస్ అధికారి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాలోత్ కవితను డోర్నకల్ అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలలో కనీసం ఆరేడుగురు అసెంబ్లీ ఎన్నికల్లో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఆశించే అసెంబ్లీ స్థానాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్ పడటం ఖాయమని అంటున్నారు.

ఉమ్మడి నల్లగొండలో..

మునుగోడు ఉపఎన్నికల వేళ బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని భావించినప్పటికీ అలా జరగలేదు. అయితే ఈసారి మాత్రం.. ఇక్కడ్నుంచి బీసీకే టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు కోరుతున్నారు. నారాబోయిన రవి ముదిరాజ్, కర్నె ప్రభాకర్ తో పాటు కొద్దిరోజుల కిందట బీఆర్ఎస్ లో చేరిన పల్లె రవి కుమార్ గౌడ్ కూడా గులాబీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక సాగర్ లో చూస్తే నోముల భగత్ కు కాకుండా స్థానికులమైన తమకు ఈసారి ఛాన్స్ ఇవ్వాలని గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్‌ వంటి నేతలు కోరుతున్నారు. నల్గొండ నియోజకవర్గంలో కూడా కంచర్లకు ధీటుగా మరో బీసీ నేత కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కోదాడ నియోజకవర్గంలో వనపర్తి లక్ష్మీనారాయణ ఉన్నారు. లక్ష్మీనారాయణ భార్య శిరీష కోదాడ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా కొనసాగుతున్నారు.