Call Drops: తెలుగు రాష్ట్రాల్లో కాల్ అండ్ నెట్వర్క్ డ్రాప్స్.. మరి మీ ఫోన్ సంగతేంటి.?
మన మొబైల్ ఫోన్స్ లో అప్పుడప్పుడు కాల్ డ్రాప్స్ కి గురి అవుతూ ఉంటుంది. ఏదైనా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు, విమానాశ్రయాల పరిధిలో ఉన్నప్పుడు, అడవులలో వెళ్తున్నాప్పుడు సెల్ ఫోన్ టవర్లు పడిపోతూ ఉంటాయి. వీటిని నెట్వర్క్ డ్రాప్స్ అంటారు. అయితే మనం ఎక్కడికీ వెళ్లకుండా పూర్తి నెట్వర్క్ జోన్ లో ఉన్నప్పటికీ కాల్ డ్రాప్స్, నెట్వర్క్ డ్రాప్స్ అయితే కాస్త అనుమానించాల్సిన విషయమే.

There has been a problem of call drops in Andhra Pradesh and Telangana since this afternoon
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి సెల్ ఫోన్ నెట్వర్క్ పనిచేయకుండా పోయింది. అయితే ఇది అందరికీ జరుగుతుందా అంటే కాదు కేవలం కొందరికి మాత్రమే ఇలా జరుగుతూ వస్తుంది. దీంతో సెల్ ఫోన్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవ్వాల్సి వచ్చింది. కాల్స్ రాకుండానే కాల్ డ్రాప్ పడుతుండటంతో కాలర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఇంచు మించు అన్ని నెట్వర్కులకు చెందిన సెల్ ఫోన్స్ ఇలాంటి వింత సమస్యను ఎదర్కోవల్సి వచ్చింది.
గత వారం ఇలా జరిగి ఉంటే ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సిగ్నల్స్ సమస్యగా పరిగణించి ఉండవచ్చు. ఇప్పుడు ఇలా జరుగుతుండటం పై తీవ్ర ఆందోళన చెందుతున్నారు మొబైల్ వాడకం దారులు. దీనిపై సెల్ ఫోన్ నెట్వర్క్ యాజమాన్యాలు మాత్రం ఇంకా స్పందించలేదు. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయా అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది.
T.V.SRIKAR