Vijay, Rashmika : విజయ్ దేవరకొండ తో-రష్మిక ముచ్చట గా మూడోసారి..?
ఇండస్ట్రీలో హిట్ జోడీస్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి క్లిక్ అయితే ఆ జోడీని మళ్లీ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తారు మేకర్స్. ఇప్పటికే ఈ విషయంలో రెండు సార్లు ఛాన్స్ కొట్టేసిన ఓ జంట ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అవుతోంది.

There is a full demand for hit jodies in the industry If you click once the makers will make sure to repeat that pair again and again A couple who have already taken a chance twice in this matter is now getting ready to make a third film
ముచ్చట గా మూడోసారి.. విజయ్ – రష్మిక జోడీ..
ఇండస్ట్రీలో హిట్ జోడీస్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి క్లిక్ అయితే ఆ జోడీని మళ్లీ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తారు మేకర్స్. ఇప్పటికే ఈ విషయంలో రెండు సార్లు ఛాన్స్ కొట్టేసిన ఓ జంట ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అవుతోంది. లైగర్ ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఖుషి తో హిట్ కొట్టిన రౌడీ స్టార్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇందులో ఒకదాన్ని గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుంటే మరోదాన్ని పరశురామ్ తెరకెక్కించనున్నాడు.VD12లో హీరోయిన్ గా శ్రీలీల ఫిక్స్ అయింది. పూజా కార్యక్రమాలకు కూడా ఆమె హాజరైంది. కట్ చేస్తే ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుండి శ్రీ లీల తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. VD12 సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవడంతో రష్మికా మందన్నా ని సంప్రదించుట మేకర్స్. కథ డిఫరెంట్ గా ఉండటంతో ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకుంటే ఆ ప్లేస్ ని శ్రీలీల భర్తి చేసింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుంటే ఈ ప్రాజెక్ట్ లో రష్మిక ఎంట్రీ ఇస్తోంది.
నిజానికి టాలీవుడ్ లో విజయ్–రష్మిక జంట సూపర్ హిట్ జోడి. ఈ ఇద్దరు కలిసి నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ మంచి పేరు తెచ్చింది.అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ముచ్చటగా మూడోసారి గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ లో నటిస్తుడటం ఫ్యాన్ ని ఖుషి చేసే మ్యాటర్ గా మారింది. త్వరలోనే దీని పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. మరి హ్యాట్రిక్ మూవీ ఈ జంట ఎలాంటి వండర్స్ సృష్టిస్తారు చూడాలి.