Item Song Keerthy Suresh : ఐటెం సాంగ్ రేంజ్ కి పడిపోయిన కీర్తి సురేష్..?
టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ కి ఫుల్ డిమాండ్ ఉంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన ప్రతి సారి ఈ మ్యాటర్ హైలెట్ అవుతుంది. ప్రజెంట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఓ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ రంగంలోకి దింపుతున్నారట మేకర్స్.

There is a full demand for special songs in Tollywood Presently Mahesh is doing Guntur Karam under Trivikram direction The makers have roped in star beauty Keerthy Suresh for an item song in this movie
మహానటి నుంచి ఐటెం సాంగ్ రేంజ్ కి పడిపోయిన కీర్తి మైలేజ్ ..?
టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ కి ఫుల్ డిమాండ్ ఉంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన ప్రతి సారి ఈ మ్యాటర్ హైలెట్ అవుతుంది. ప్రజెంట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఓ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ రంగంలోకి దింపుతున్నారట మేకర్స్. సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ సర్కారు వారి పాటతో బౌన్స్ బ్యాక్ అయింది. ‘దసరా’ తో సాలిడ్ హిట్ ని అకౌంట్ లో వేసుకుంది. కానీ చిరు తో చేసిన భోళా శంకర్ డిజాస్టర్ అవ్వడంతో కీర్తి కటౌట్ కి డామేజ్ జరిగింది. అర్జెంట్ గా ఓ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈసారి కొత్త ప్లాన్ ని అప్లై చేస్తోందట మహానటి. హీరోయిన్ గా కాకుండా ఐటెం బ్యూటీ గా సత్తా చాటేందుకు రెడీ అవుతోందట. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం చేస్తున్నాడు మహేష్ బాబు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానుంది. ద మొన్నటి వరకు స్పెషల్ సాంగ్ పై ఇంట్రెస్ట్ చూపించని కీర్తి సురేష్ ఈ ఆఫర్ రాగానే యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఎప్పటి నుంచో కీర్తి సురేష్ తో ఐటమ్ సాంగ్ చేయించాలని చూస్తున్నాడు త్రివిక్రమ్.గుంటూరు కారంతో ఆ కోరిక నెరవేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.