MLA Guvwala Balaraju : నా భర్తను కాంగ్రెస్ వాళ్లు చంపేస్తారు.. ఎమ్మెల్యే భార్య కన్నీళ్లు..
నాగర్‌కర్నూల్ (Nagarkurnool ) జిల్లా అచ్చంపేట ( Atchampet ) లో ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే (MLA ) గువ్వల బాలరాజు (Guvwala Balaraju) ప్రచార కార్యక్రమంలో గలాటా జరిగింది. ప్రచారం ముగించుకుని బాలరాజు తిరిగి వస్తుండగా.. ఆయన వర్గీయులకు, కాంగ్రస్ అభ్యర్థి వంశీకృష్ణ వర్గీయులకు మధ్య వివాదం జరిగింది.

There is a tense situation in Atchampet of Nagarkurnool district. The gala was held at the campaign program of sitting MLA Guvwala Balaraju
నాగర్‌కర్నూల్ (Nagarkurnool ) జిల్లా అచ్చంపేట ( Atchampet ) లో ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే (MLA ) గువ్వల బాలరాజు (Guvwala Balaraju) ప్రచార కార్యక్రమంలో గలాటా జరిగింది. ప్రచారం ముగించుకుని బాలరాజు తిరిగి వస్తుండగా.. ఆయన వర్గీయులకు, కాంగ్రస్ అభ్యర్థి వంశీకృష్ణ వర్గీయులకు మధ్య వివాదం జరిగింది. టామా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కూడా రాయి తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయనను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యేపై దాడి విషయం తెలిసిన ఆయన భార్య దిగ్భ్రాంతికి గురయ్యారు. తన భర్తను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హాస్పిటల్ ముందు కన్నీరుమున్నీరయ్యారు. ప్రచారానికి వెళ్లిన ప్రతీసారి ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ బాలరాపై రాళ్లు విసిరారంటూ ఆరోపించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారని, దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తన భర్తకు ఏం జరుగుతోందని ప్రతీ క్షణం భయంతో బతుకుతున్నానంటూ హాస్పిటల్ ముందు కన్నీటిపర్యంతమయ్యారు.