Dialnews Effect, Pawan Kalyan : పవన్ ఆస్తులపై సోషల్ మీడియాలో రచ్చ.. డయల్ న్యూస్ బ్రేకింగ్‌తో ప్రకంపనలు..
ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. సోషల్‌మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఇప్పుడు ఒకటే చర్చ. పార్టీ కోసం పవన్ ఆస్తులు అమ్ముకుంటున్నారు అని ! ఎన్నికల ఖర్చుల కోసం వంద కోట్లు సమీకరించే పనిలో ఉన్న పవన్.. ఇప్పటికే 20కోట్లకు ఇల్లు అమ్మేశారు. మరో రెండు స్థలాలను కూడా త్వరలో అమ్మకాలని ఉంచబోతున్నారన్న విషయాన్ని.. డయల్‌న్యూస్ (Dialnews) ఎక్స్‌క్లూజివ్‌గా బయటపెట్టింది.
ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. సోషల్‌మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఇప్పుడు ఒకటే చర్చ. పార్టీ కోసం పవన్ ఆస్తులు అమ్ముకుంటున్నారు అని ! ఎన్నికల ఖర్చుల కోసం వంద కోట్లు సమీకరించే పనిలో ఉన్న పవన్.. ఇప్పటికే 20కోట్లకు ఇల్లు అమ్మేశారు. మరో రెండు స్థలాలను కూడా త్వరలో అమ్మకాలని ఉంచబోతున్నారన్న విషయాన్ని.. డయల్‌న్యూస్ (Dialnews) ఎక్స్‌క్లూజివ్‌గా బయటపెట్టింది. డయల్‌న్యూస్ కథనాలు.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. మన చానెల్ బ్రేక్ చేసిన న్యూస్‌పై.. జనసేన (Janasena) అనుకూల, వ్యతిరేక మీడియాలో పరస్పర విమర్శలు వినిపిస్తున్నాయ్. మచ్చలేని రాజకీయానికి పవన్ నిదర్శనమంటూ.. అభిమానులు, జనసైనికుల నుంచి స్పందన కనిపిస్తోంది. నిన్ను రెండు చోట్ల ఓడించిన జనాల కోసం.. ఇంత త్యాగం అవసరమా అన్నయ్యా అంటూ.. పవన్ తీరుపై ఎమోషనల్ అవుతూ.. అభిమానులు, జనసేన కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.
ప్యాకేజీ స్టార్ (Package Star) అంటూ వైసీపీ (YCP) చేస్తున్న కామెంట్లకు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ప్యాకేజీలు తీసుకుంటే స్థలాలు అమ్ముకోవాల్సిన అవసరం ఏముందని జన సైనికులు నిలదీస్తున్నారు. రాజకీయాల్లోకి ఎవరు ఎక్కువ సంపాదించారో.. బహిరంగ చర్చకు రావాలని జనసైనికులు, పవన్ అభిమానులు చాలెంజ్ విసురుతున్నారు. ఏపీ సీఎం జగన్‌కే సవాల్ విసురుతున్నారు. 2004కి ముందు జగన్ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంతో పోల్చి చూసే దమ్ముందా అంటా ఛాలెంజ్ చేస్తున్నారు. అవసరం అయితే దీని మీద ఓపెన్ డిబేట్‌కు సిద్ధం అంటున్నారు జనసైనికులు. అక్రమ ఆస్తులు సంపాదించి పవన్ జైలుకెళ్లలేదంటూ… జనసేనానికి జేజేలు పలుకుతున్నారు.
ఇక అటు వ్యతిరేక మీడియాలో పవన్ ఆస్తుల అమ్మకం (Sale of Pawan’s properties) మీద ఇష్టం వచ్చిన వార్తలు రాసుకొస్తున్నారు. సానుభూతి కోసమే ఆస్తులు అమ్ముకున్నారని కొందరు.. అసలు ఆస్తులే అమ్ముకోలేదని మరికొందరు.. జనసేనాని మీద అసత్య కథనాలు రాస్తున్నారు. దీని మీద జనసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. పవన్ అసలు గుణం ఇదే అని బయటపెట్టిన డయల్‌న్యూస్‌కు థ్యాంక్స్ చెప్తున్న అభిమానులు.. ఇప్పటికైనా కొందరు దిక్కుమాలిన రాతలు మానుకోవాలని సూచిస్తున్నారు. పేరుకు ముందు గొప్ప అని తగిలించుకుంటే.. గొప్పవాళ్లు కాలేరని.. అవతలి వాళ్ల గొప్పతనం గుర్తిచినప్పుడే గొప్ప అవుతారని అంటున్నారు. ఏమైనా డయల్‌న్యూస్ కథనం పవన్ వ్యతిరేక మీడియా ఉలిక్కిపడేలా చేస్తుంటే.. జనసేన అభిమానులను ఎమోషనల్ చేస్తోంది.