Vazma: ఎవరీ బుట్టబొమ్మ?
భారత్ - ఆఫ్ఘనిస్థాన్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. అందుకే ఆమెకు ఇండియా అంటే చాలా ఇష్టం అని వాజ్మా చెప్పుకొస్తుంది.

Afghanistan Women Vazma Supports Team India
ఆఫ్ఘనిస్థాన్‌లో ఓ మహిళ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆమె.. ఆ సందర్భంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈమె కోసం గూగుల్‌లో చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఈమె పేరు వాజ్మా అయూబీ. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినది. ఇప్పుడు దుబాయ్‌కి షిఫ్ట్ అయింది. వాజ్మా మన భారత క్రికెట్ జట్టుకు వీరాభిమాని. అందువల్ల టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్ చూసేందుకు వస్తూ ఉంటుంది. వాజ్మా అయూబీ ఒక విజయవంతమైన వ్యాపార మహిళ. ఆమె వయసు కేవలం 28 ఏళ్లు. ప్రస్తుతం ఈమె ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్లోబల్ మేనేజ్‌మెంట్ అండ్ లీడర్‌షిప్‌లో మాస్టర్స్ చదువుతోంది.
ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫ్రెండ్ ఫాలోయింగ్ ఉంది. 6.87 లక్షల మంది ఆమె అకౌంట్‌ని ఫాలో అవుతున్నారు. తరచూ తన ఫొటోలు, వీడియోలను ఆ అకౌంట్‌లో షేర్ చేస్తోంది. వాజ్మా అయూబీ, ‘లామన్ క్లాతింగ్’ పేరుతో తన సొంత దుస్తుల బ్రాండ్‌ను కూడా నడుపుతోంది. ఆమె వేసుకునే డ్రెస్సుల్లోనూ ఆ క్రియేటివిటీ కనిపిస్తుంది. కొన్నేళ్ల కిందట ఢిల్లీలో నివసించింది. అప్పుడు అక్కడే ఉంటూ చదువుకునేది. వాజ్మాకు బాలీవుడ్ సినిమాలు, పాటలంటే చాలా ఇష్టం. “ఢిల్లీలో నివసిస్తున్నప్పుడు, నాకు భారతీయ స్నేహితులతో అంతాక్షరి ఆడటం చాలా ఇష్టం” అని తెలిపింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి వాజ్మా అయూబీ వీరాభిమాని. అదే సమయంలో టీమిండియా జట్టు అంటే కూడా ఇష్టమే. భారత్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. అందుకే ఆమెకు ఇండియా అంటే చాలా ఇష్టం అని వాజ్మా చెప్పుకొస్తుంది.