Congress : కాంగ్రెస్ గెలిస్తే SCని ముఖ్యమంత్రిని చేస్తారా?
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ కనిపిస్తుందని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ కేడర్ లో కూడా ఎన్నడూ లేనంత జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం.. ముఖ్యంగా రాహుల్ గాంధీ తెలంగాణపై బాగా ఫోకస్ చేశారు. బహిరంగ సభలు, రోడ్ కార్నర్ మీటింగ్స్, సమాలోచనలతో బిజీ బిజీ అయ్యారు. దాదాపు పదేళ్ళ KCR పాలనలో అవినీతిమయం, కుటుంబ పాలన తప్ప మరేదీ లేదన్నది.. కాంగ్రెస్ జనంలోకి బాగా తీసుకెళ్తోంది.
( Telangana elections ) తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ కనిపిస్తుందని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ కేడర్ లో కూడా ఎన్నడూ లేనంత జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం.. ముఖ్యంగా రాహుల్ గాంధీ తెలంగాణపై బాగా ఫోకస్ చేశారు. బహిరంగ సభలు, రోడ్ కార్నర్ మీటింగ్స్, సమాలోచనలతో బిజీ బిజీ అయ్యారు. దాదాపు పదేళ్ళ KCR పాలనలో అవినీతిమయం, కుటుంబ పాలన తప్ప మరేదీ లేదన్నది.. కాంగ్రెస్ జనంలోకి బాగా తీసుకెళ్తోంది. దీనికితోడు చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో KTR మాట్లాడిన మాటలు.. తెలంగాణలో సీమాంధ్రులు BRSకు దూరం చేశాయి. దాని ప్రభావంతో BRSకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని టాక్ నడుస్తుంది. అటు చేసి.. ఇటు చేసి కాంగ్రెస్ 55 స్థానాలు గెలుచుకున్నా.. ఏదో రకంగా ప్రభుత్వాన్ని స్థాపించగలదని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
కాంగ్రెస్ ఇప్పటికే దేశం మొత్తమ్మీద.. SCలు, STలు తమ బలం అని నమ్ముతుంది. దాన్ని జనంలోకి తీసుకెళ్లడానికే.. మల్లికార్జున ఖర్గేని పార్టీకి జాతీయ అధ్యక్షుడు కూడా చేసింది. అన్ని రాష్ట్రాల్లో SC, ST ఓట్లను నిలబెట్టుకోగలిగితే పార్టీ మనుగడకు ఢోకా ఉండదని బలంగా నమ్ముతోంది. అయితే ఈసారి తెలంగాణలో గెలిస్తే… SCని ముఖ్యమంత్రి ని ఎందుకు చేయకూడదు అనే వాదన పార్టీలో ఒక వర్గం బలంగా వినిపిస్తోంది. SC ని ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేసి KCR ఎలాగూ మాట తప్పాడు. ఆ పార్టీకి ఎప్పటికీ SCని ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేదు. బీజేపీ ఇప్పటికే BC ఓట్ బ్యాంక్ ను నమ్ముకుంది. BCని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించింది కూడా.
తెలంగాణ ఇస్తానని చెప్పి ఇచ్చింది మేమే.. ఇప్పుడు SCని సీఎం చేసిందీ తామే… అని చెప్పుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ లో కొందరు బలంగా చెబుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఎలాగూ SCని ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేదు. అక్కడ అగ్ర నాయకుల్లో SCలు ఎవరూ లేరు. తెలంగాణలో ఆ ఛాన్సుంది.. కానీ SCని సీఎం చేస్తామని ఇప్పుడే ప్రకటిస్తే.. కచ్చితంగా తెలంగాణ రెడ్లు అడ్డం తిరిగే అవకాశముంది. మిగిలిన కులాలు కూడా దూరమవుతాయి. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే బెటర్ అని కొందరు సీనియర్లు భావిస్తున్నారు.
కాంగ్రెస్ అంటేనే రెడ్లు… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్లే.. ముఖ్యమంత్రి అవుతున్నారు. మిగతా ఎవరు వచ్చినా నిలబడే అవకాశం లేదన్న వాదన కూడా ఉంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం బలంగా నిలబడితే.. ఎస్సీని ముఖ్యమంత్రిని చేయడం అసాధ్యమేమీ కాదనీ.. గతంలో దామోదరం సంజీవయ్యని CM చేయలేదా అని వాదించేవారు కూడా ఉన్నారు.
రాహుల్ గాంధీ తన సమావేశాల్లో తరచూ CLP నేత ( Bhatti Vikramarka )భట్టి విక్రమార్కని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాగని రేవంత్ రెడ్డిని వదులుకోవడం లేదు. రేవంత్ రెడ్డి PCC అధ్యక్ష బాధ్యతలు చేపట్టాకే.. తెలంగాణలో కాంగ్రెస్ కి బాగా ఊపు వచ్చింది. అంతేకాదు తెలంగాణలో రెడ్లలో ఒక వర్గం రేవంత్ కు సపోర్ట్ గా నిలిచింది. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్ ( Congress ) లో రేవంత్ రెడ్డితో మిగిలిన సీనియర్లు ఎవరికీ పడటంలేదు. బయటి నుంచి వచ్చి పెత్తనం చేస్తున్నాడనే ఆవేదన వాళ్ళలో బాగా కనిపిస్తోంది. అందువల్ల సీనియర్ల మద్దతు రేవంత్ కి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ గెలిస్తే.. నేను కూడా ముఖ్యమంత్రిని అవుతా.. అనేవాళ్ళు పది మంది పుట్టుకొస్తారు. కాంగ్రెస్ తో సమస్య అది. ఏదేమైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరిని చేస్తారన్న విషయంలో పార్టీలోనే హోరాహోరీ పోరు మాత్రం తప్పదు.