Sports School: స్పోర్ట్స్ స్కూల్లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. ఇందులో నిజం ఎంత..?
మహిళల పట్ల అత్యాచారాలు దేశంలో ఏదో ఒక మూల తరుచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఒక వార్తా పత్రిక తెలంగాణలోని హకీం పేట స్పోర్ట్స్ స్కూల్లో మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రచురించింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావులేదని దీనిపై సత్వరమే విచారణ జరుపుతామన్నారు. దీంతో సంబంధిత శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

There were allegations of sexual assault on a minor girl in Hakimpet Sports School
స్పోర్ట్స్ స్కూల్ లోని ఏవో బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని పిల్లలు తమ ఆవేదన తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బాలికల గదుల్లోకి రావడం.. సాయంత్రం సమయంలో ఆటల పేరుతో తమ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తూ వికృత చేష్టలకు తెరలేపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ బాలికలను కారులో ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో స్పోర్ట్స్ స్కూల్‌లోని బాలికలు ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆ ఆఫీసర్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారంటూ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనంపై విచారణ జరపాలని ఆదేశించారు. ఇప్పటికే స్పోర్ట్స్ స్కూల్ లోని ఒక అధికారిని విధుల నుంచి తొలగించామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇంకా ఎవరైనా దోషులు ఉంటే వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అలాగే మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదలబోమన్నారు.
ఇదిలా ఉంటే సంబంధిత స్పోర్ట్స్ స్కూల్ అథారిటీ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఇప్పటి వరకూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఒకవేళ ఇలాంటివి జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ ఈవార్త తప్పుగా రాసిఉంటే వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదిఏమైనా ఈ సంఘటనపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇది కేవలం ఆరోపణలేనా.. లేక కావాలని ఇలా అవాస్తవాలను ప్రచురించారా అన్నది భవిష్యత్తులో తేలేఅవకాశం ఉంది.
T.V.SRIKAR