CM KCR : కేసీఆర్ లెక్కలు ఇవే ..! 70సీట్లు పక్కా అని ధీమా ..!!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. మరో కొన్ని గంటల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. హ్యాట్రిక్ కొడతాం.. మళ్లా అధికారంలోకి వస్తాం అన్న ధీమా సీఎం కేసీఆర్, కేటీఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే అధికారం అని చెబుతున్నా.. అవన్నీ తప్పని నిరూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం పోలింగ్ జరుగుతున్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్ మెంట్ ను తెలుసుకుంటూ కొన్ని ఈక్వేషన్లు.. మరికొన్ని లెక్కలతో హ్యాట్రిక్ పక్కా అన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకేనేమో.. ఫలితాల తెల్లారి అంటే 4నాడు మధ్యాహ్నం రెండింటికి కేబినెట్ మీట్ పెట్టారు సీఎం కేసీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 1, 2023 | 06:13 PMLast Updated on: Dec 01, 2023 | 6:13 PM

These Are Kcrs Calculations For Telangana State Assembly Elections Dhima Assured That 70 Seats Are Fixed

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. మరో కొన్ని గంటల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. హ్యాట్రిక్ కొడతాం.. మళ్లా అధికారంలోకి వస్తాం అన్న ధీమా సీఎం కేసీఆర్, కేటీఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే అధికారం అని చెబుతున్నా.. అవన్నీ తప్పని నిరూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం పోలింగ్ జరుగుతున్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్ మెంట్ ను తెలుసుకుంటూ కొన్ని ఈక్వేషన్లు.. మరికొన్ని లెక్కలతో హ్యాట్రిక్ పక్కా అన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకేనేమో.. ఫలితాల తెల్లారి అంటే 4నాడు మధ్యాహ్నం రెండింటికి కేబినెట్ మీట్ పెట్టారు సీఎం కేసీఆర్.

KCR Cabinet meeting : 4న కేసీఆర్ కేబినెట్ భేటీ.. ఇదేం షాక్‌.. ఇంత కాన్ఫిడెన్సా..!

గురువారం నాడు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సరళిపై BRS పెద్దలు పోస్ట్ మార్టం చేసుకుంటూ వచ్చారు. 70కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ఆ పార్టీ వార్ రూమ్ వర్గాలు నివేదికను కేసీఆర్ , కేటీఆర్ కీ అందించాయి. అందుకే పార్టీ సొంత బలంతోనే మళ్ళా అధికారంలోకి వస్తామని .. పోలింగ్ ముగిశాక కేటీఆర్ ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా ఆదివారం నాటి ఫలితాలు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ చింతమడకలో ఓటేసి.. ఫామ్ హౌజ్ కి వచ్చాక ప్రతి నియోజకవర్గంలోని అభ్యర్థికి, సీనియర్ లీడర్లకు ఫోన్లు చేస్తూ తగిన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇక హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రారంభించిన వార్ రూమ్ ప్రత్యేకంగా పోల్ మేనేజ్ మెంట్ పైనే దృష్టిపెట్టింది. ఈ విషయంలో ప్రతిపక్షాల కంటే తామే ముందున్నామని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. అదే తమకు కలసి వస్తుందని అంటున్నారు ఆ పార్టీ లీడర్లు. ఏయే వర్గాల ఓట్లు బీఆర్ఎస్ కి పడ్డాయన్నదానిపై విశ్లేషణ జరిగింది. పార్టీ సంప్రదాయ ఓట్లు, వివిధ పథకాల లబ్దిదారుల ఓట్లు ఖచ్చితంగా పడ్డాయని కారు పార్టీ నమ్ముతోంది. కొత్తగా ఓట్లేసిన యువతతోపాటు.. ఆసరా ఫించన్లు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా లబ్దిదారుల్లో 90శాతం మంది ఓట్లు కారు గుర్తుకి పడ్డాయట. అయితే దళితబంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, నిరుద్యోగ యువత లాంటి అంశాలు బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రభావం చూపించాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా చీలిందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అవి మొత్తం కాంగ్రెస్ కి పడలేదు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కలిపి 40కి పైగా సీట్లల్లో బీజేపీకి బాగానే ఓట్లు పడ్డాయని తేల్చారు. ఇది కాంగ్రెస్ గెలుపు ఓటములపై ప్రభావం చూపించిందని అంటున్నారు. అయితే హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మెజారిటీ సీట్లు తమకే వస్తాయని బీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించే అవకాశముందని అంటున్నారు. గ్రౌండ్ లెవల్లో కాంగ్రెస్ కొన్ని చోట్ల బలంగా లేకపోవడంతో ఆ పరిస్థితులను బీఆర్ఎస్ అభ్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు వార్ రూమ్ నివేదికలు చెబుతున్నాయి. ఇన్ని లెక్కలు దగ్గర పెట్టుకున్నందునే కేసీఆర్ గెలుపుపై గట్టి నమ్మకంగా ఉన్నారు… అందుకే రిజల్ట్స్ తెల్లారి మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.