Chandrayaan-3 Vs Luna-25: భారత్ చంద్రయాన్3 కి, రష్యా లూనా 25 కి తేడాలు ఇవే..
భారత్ పంపిన చంద్రయాన్3 కి, రష్యా పంపిన లూనా 25 కి చాలా తేడాలు ఉన్నాయి.
మనదేశం చంద్రయాన్ అనే పేరుతో గతంలో రెండు రాకెట్లను అంతరిక్షంలోకి పంపింది ఇస్రో. మొదటి ప్రయోగం పూర్తిగా విఫలం కాగా రెండవ ఆపరేషన్ అడుగు దూరంలో వెనుదిరిగింది. అదే మూడవ సారి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన చంద్రయాన్- 3 విజయతీరాలకు కాస్త దగ్గర్లో ఉంది. అయితే ఇలాంటి ప్రయోగాన్నే రష్యా కూడా కొన్ని రోజుల క్రితం చేపట్టింది. దీనికి లూనా 25 అనే పేరు పెట్టింది. గత రెండు రోజుల క్రితమే చంద్రుడికి చేరువగా వచ్చి సాంకేతిక లోపం వల్ల వెనుదిరగాల్సి వచ్చింది.
ఇప్పటి వరకూ రష్యా, అమెరికా, చైనా లు మాత్రమే చంద్రుడిపైకి తమ రాకెట్లను పంపించగలిగాయి. ఈ జాబితాలోకి మన దేశపు జండా ఎగురవేయాలనే సంకల్పంతో చంద్రయాన్ 3ని అంతరిక్షం లోకి ప్రవేశపెట్టారు. 50ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఆగస్ట్ 10న లూనా 25 అనే రాకెట్ ను రష్యా పంపింది. కానీ అది విఫలం అయింది. మన చంద్రయాన్ కి, రష్యా లూనాకి తేడాలు ఇప్పుడు తెలుసుకుందం.
ఇండియన్ రాకెట్
వాడుకలో ఉండే పేరు : చంద్రయాన్
శాస్త్రీయనామం : ఎల్ వీ ఎం3 ఎం4
ప్రయోగం తేది : జూలై 14
లాంచింగ్ స్టేషన్ : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
బరువు : 3,900 కిలోలు
పేలోడ్ మాస్ : 1,752(ల్యాండర్)+ 26 కిలోలు (రోవర్)
ల్యాండయ్యే ప్రాంతం : దక్షిణ ధృవం
ప్రయాణ సమయం : 42 రోజులు
ల్యాండయ్యే తేది : ఆగస్ట్ 23
మిషన్ కాలవ్యవధి : 14 రోజులు
రష్యన్ రాకెట్
వాడుకలో ఉండే పేరు : లూనా 25
శాస్త్రీయనామం : సోయుజ్2.2బీ/ ఫ్రెగట్
ప్రయోగం తేది : ఆగస్ట్ 10
లాంచింగ్ స్టేషన్ : వొస్టౌక్నీ కాస్కోడ్రోమ్
బరువు : 1,750 కిలోలు
పేలోడ్ మాస్ : 31 కిలోలు
ల్యాండయ్యే ప్రాంతం : దక్షిణ ధృవం
ప్రయాణ సమయం : 12 రోజులు
ల్యాండయ్యే తేది : ఆగస్ట్ 22
మిషన్ కాలవ్యవధి : ఏడాది
ఈ వివరాలను బట్టి ఇండియన్ రాకెట్ పని తీరుకు, రష్యాన్ రాకెట్ కి చాలా రకాలా సాంకేతికపరమైన మార్పులు ఉన్నట్లు తెలుస్తుంది. మనకు దాదాపు 42 రోజుల సమయం పడితే, రష్యాకు కేవలం 12 రోజుల అతి తక్కువ వ్యవధి ఉండటం గమనించదగ్గ అంశం. అలాగే చంద్రుడిపై ల్యాండయిన మిషన్ వ్యవధిలో కూడా ఇండియాతో పోలిస్తే రష్యాది ఎక్కువ ఉంది.
T.V.SRIKAR