Smita Sabharwal : స్మితాకు నచ్చిన సినిమాలు ఇవే.. నెటిజన్లు ఏమన్నారో తెలుసా..
స్మితా సబర్వాల్.. తెలంగాణలో నెలరోజులుగా పదేపదే వినిపిస్తున్న పేరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా స్మితా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. ఐతే వాటిని ఆమె ఖండించారు. తెలంగాణలో ఉంటానని ప్రకటించారు. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో భాగంగా.. స్మితా సబర్వాల్‌ను ఆర్థిక శాఖ సెక్రటరీగా నియమించింది రేవంత్ సర్కార్. ఒకరకంగా లూప్‌లైన్‌లోకి నెట్టేశారని.. పెద్దగా పనిలేని బాధ్యతలు స్మితా అప్పగించారనే ప్రచారం జరుగుతోంది.

These are the movies that Smita likes.. Do you know what netizens are saying..
స్మితా సబర్వాల్.. తెలంగాణలో నెలరోజులుగా పదేపదే వినిపిస్తున్న పేరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా స్మితా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. ఐతే వాటిని ఆమె ఖండించారు. తెలంగాణలో ఉంటానని ప్రకటించారు. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో భాగంగా.. స్మితా సబర్వాల్‌ను ఆర్థిక శాఖ సెక్రటరీగా నియమించింది రేవంత్ సర్కార్. ఒకరకంగా లూప్‌లైన్‌లోకి నెట్టేశారని.. పెద్దగా పనిలేని బాధ్యతలు స్మితా అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. ఐతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స్మితా సబర్వాల్.. తనకు నచ్చిన మూడు సినిమాలు ఇవే అంటూ ట్వీట్ చేశారు.
అధికారిక కార్యక్రమాల్లో బిజిబిజీగా గడిపిన స్మితా.. ఈ మధ్య మూడు అద్భుతమైన సినిమాలు చూశానని.. అవి తనకు ఎంతగానో నచ్చాయంటూ ట్వీట్ చేశారు. హిందీలో వచ్చిన 12th ఫెయిల్, స్పానిష్ చిత్రం సొసైటీ ఆఫ్ ది స్నో, తమిళంలో వచ్చిన అన్నపూరణి సినిమాలను చూశానని ట్వీట్ చేశారు. ఈ సినిమాలోని క్యారెక్టర్లు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. మీ లిస్టులో ఏం సినిమాలు ఉన్నాయో చెప్పాలంటూ తన ట్వీట్‌లో అడిగారు. ముఖ్యంగా 12th ఫెయిల్ మూవీ గురించి అద్భుతంగా రాసుకొచ్చారు స్మితా. మనకు ఏదైనా సాధించాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా అందుకు సహకరిస్తుందంటూ కోట్ చేశారు.
ఏమైనా మంచి సినిమాలు సజెస్ట్ చేయండి అని స్మితా కోరగా.. ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్లలో భారీ లిస్ట్ పెడుతున్నారు. ఎక్కువ మంది హాయ్ నాన్న సినిమా చూడండి మేడమ్ అంటుంటే.. మరికొందరు మాత్రం ఒక ఐఏఎస్‌గా మీరు జిగర్తాండ డబుల్ ఎక్స్ చూడాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. కామెంట్ సెక్షన్‌లో కొత్త చర్చ మొదలుపెట్టారు. అన్నపూరణి సినిమా కాన్సెప్ట్‌ను మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా.. ఆ సినిమా మీద మీ రివ్యూ.. మీ ఒపీనియన్ చెప్పండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. వృత్తిపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ.. చాలా విషయాలన స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఫాలోవర్లు కూడా ఆమెకు భారీగానే ఉన్నారు.