Chandrababu: సిట్‌ కార్యాలయానికి చంద్రబాబు.. అధికారులు అడగబోయే ప్రశ్నలు ఇవే

సీఐడీ అధికారులు చంద్రబాబుపై సంధించే ప్రశ్నలు ఇవే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2023 | 07:15 PMLast Updated on: Sep 09, 2023 | 7:15 PM

These Are The Questions Asked By The Sit Officials To Chandrababu Who Reached The Sit Office

దాదాపు 9 గంటల ప్రయాణం తరువాత చంద్రబాబును విజయవాడలోని సిట్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు సీఐడీ అధికారులు. ఉదయం ఎలాంటి ఆధారాలు చూపకుండా బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఇప్పుడు సిట్‌ ముందు తాము సేకరించిన ఆధారాలను సమర్పించే ఛాన్స్‌ ఉంది. ఈ కేసులో ముఖ్యంగా 10 ప్రశ్నలను చంద్రబాబు ఎదుర్కోబోతున్నట్టుగా తెలుస్తోంది.

  • 2014లో తీసుకువచ్చిన ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌కు రూపకల్పన చేసింది ఎవరు ?
  • స్కాం చేసే ఉద్దేశంతోనే స్కీం తయారు చేశారా ?
  • స్కీం వివరాలు జీవోలో ఒకలాగా ఎంవోయూలో మరోలా ఎందుకూ రూపొందించారు, దీని వెనక ఉన్నది ఎవరు ?
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌లో క్లస్టర్స్‌ ప్రారంభించకుండానే ఎందుకు ఎంవోయూ చేసుకున్నారు, అంత అవసరం ఏమొచ్చింది ?
  • సీమన్‌ కంపెనీ తన 90 శాతం వాటా చెల్లించకుండా ప్రభుత్వం తన 10 శాతం వాటా 371 కోట్లు ఎందుకు విడుదల చేసింది ?
  • సీనియర్‌ అధికారులు వద్దు అన్నా ఎందుకు నిధులు విడుదల చేయించారు ?
  • 371 కోట్లలో 241 కోట్లు ఎలా తప్పుదారి పట్టాయి ?
  • షెల్‌ కంపెనీలు ఆ డబ్బును చివరగా ఎవరికి చేర్చాయి ?
  • ఈ కంపెనీలు షెల్‌ కంపెనీలని ముందే తెలుసా ?
  • టీడీపీ ప్రభుత్వంలోనే ఈ తప్పు జరిగినా ఎందుకు బయటికి రానివ్వలేదు ?

ముఖ్యంగా ఇవే ప్రశ్నలు ఇప్పుడు చంద్రబాబును సిట్‌ అధికారులు ప్రశ్నించబోతున్నట్టు సమాచారం. ఈ ప్రశ్నల చుట్టే కేసుకు సంబంధించిన అన్ని వివరాలు అల్లుకుని ఉన్నాయి. వీటి నుంచి బాబు ఇచ్చే వివరణ ఆధారంగానే అధికారులు తరువాతి చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది సస్పెన్స్‌గా మారింది.