Anant Ambani Gift, Watch : అనంత్ అంబానీ గిఫ్ట్‌గా ఇచ్చిన వాచ్ ప్రత్యేకతలు ఇవే.. ఒక్కోటి ఎన్ని కోట్లో తెలుసా ?
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు.. అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రెండు రోజుల క్రితం అనగా జూలై 12, శుక్రవారం నాడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మన దేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు తరలి వచ్చారు.

These are the special features of the watch that Anant Ambani gave as a gift.. Do you know how many crores each?
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు.. అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రెండు రోజుల క్రితం అనగా జూలై 12, శుక్రవారం నాడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మన దేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఇక బాలీవుడ్ తారంలదరూ ఈ పెళ్లికి హాజరయ్యారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జున, నయనతార దంపతులు, అఖిల్ తరలి వెళ్లారు.
ఈ పెళ్లిలో రజనీకాంత్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రాలు డ్యాన్స్‌తో అలరించారు. ఇదంతా ఒక్కెత్తు ఐతే అనంత్ అంబానీ తన ఫ్రెండ్స్‌కు ఇచ్చి గిఫ్ట్‌లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన పెళ్లికి హాజరైన స్నేహితులను అనంత్ అంబానీ విలువైన బహుమతులతో ముంచెత్తారు. ఒక్కొక్కరికి 2 కోట్ల విలువైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చి వారిని ఆశ్చర్యపరిచారు. పెళ్లి కొడుకు స్నేహితుల బృందానికి “ఆడెమర్స్ పిగ్వేట్” అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందిన ఖరీదైన వాచీలని బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. గెస్ట్‌లు వాళ్లకిచ్చిన లగ్జరీ గిఫ్ట్ హ్యాంప్లర్ల వీడియోలను షేర్ చేశారు. అనంత్‌కి బాలీవుడ్‌లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ ఉన్నారు.
ఇప్పుడు వీళ్లకే తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచీలు ఇచ్చాడు. మార్కెట్‌లో ఈ ఒక్క వాచీ ధర 2 కోట్ల పైమాటే. ఈ వాచీలో 41 ఎంఎం 18 క్యారట్స్ పింక్ గోల్డ్ కేస్, 9.5 ఎంఎం మందంతో ఉంటుంది. సఫైర్ స్టోన్ క్రిస్టల్ బ్యాక్, స్క్రూ లాక్ క్రోన్ ఉన్నాయి. ఇందులో పింక్ గోల్డ్ టోన్డ్ డయల్, బ్లూ కౌంటర్లు, పింక్ గోల్డ్‌తో పొదిగిన గంటలకు సంబంధించిన మార్కింగ్, షనింగ్ ఇచ్చే కోటింగ్‌తో రాయల్ ఓక్ ముళ్లు ఉంటాయి. అంతేకాకుండా ఈ వాచ్‌లలో పింక్ గోల్డ్ టోన్డ్ ఉన్న ఇన్నర్ బెజెల్, మ్యానుఫ్యాక్చరింగ్ కాలిబర్ 5134 సెల్ఫ్-వైండింగ్ మూవ్మెంట్ ఈ వాచీకి ఉన్నాయి. అంటే ఇది పూర్తిగా ఆటోమెటెడ్ వాచీ అన్నమాట.
దీనిలో వారం, రోజు, తేదీ, ఖగోళ, చంద్రుడి వివరాలు, నెల, లీప్ సంవత్సరం, గంటలు, నిమిషాలను చూపించే శాశ్వత క్యాలెండర్ రావడం ఈ వాచ్ హైలెట్. ఇది 40 గంటల బ్యాటరీ పవర్ రిజర్వ్ కలిగి ఉంది. 18 క్యారట్ల పింక్ గోల్డ్ బ్రాస్లెట్, ఎపి ఫోల్డింగ్ బకిల్, అదనంగా బ్లూ అలిగేటర్ స్ట్రాప్ కూడా ఈ వాచీకి వస్తుంది. 20 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్‌లను ధరించి షారుక్, రణ్‍వీర్ పోజులిచ్చిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.