ఈ బ్యూటీలే ఎట్రాక్షన్, కలర్ ఫుల్ గా మెగా వేలం
ఐపీఎల్ మెగావేలంలో ఆటగాళ్ళతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లలో కొందరు బ్యూటీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ తన అందంతో మెస్మరైజ్ చేయగా... పంజాబ్ కింగ్స్ ఓనర్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతాతో పాటు కోల్ కత్తా నైట్ రైడర్స్ కో ఓనర్ జూహ్లీ చావ్లా కుమార్తె జాహ్నవి మెహతా మెగావేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఐపీఎల్ మెగావేలంలో ఆటగాళ్ళతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లలో కొందరు బ్యూటీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ తన అందంతో మెస్మరైజ్ చేయగా… పంజాబ్ కింగ్స్ ఓనర్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతాతో పాటు కోల్ కత్తా నైట్ రైడర్స్ కో ఓనర్ జూహ్లీ చావ్లా కుమార్తె జాహ్నవి మెహతా మెగావేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎడారిదేశంలో హీట్ పెంచిన మెగా ఆక్షన్ కు తమ వ్యూహాలతో ఈ బ్యూటీలు మరింత కలర్ ఫుల్ నెస్ తెచ్చారు. ఈ సారి ముందుగా చెప్పుకోవాల్సింది క్యావా మారన్ గురించే… అభిమానులు కావ్యాపాపగా పిలుచుకునే ఈ సన్ రైజర్స్ ఓనర్ మరోసారి వేలంలో తనదైన మార్క్ చూపించింది. తమ పర్స్ లో 45 కోట్లే ఉన్నప్పటకీ పలువురు ప్లేయర్స్ కోసం 20 కోట్ల వరకూ బిడ్ వేసి ప్రత్యర్థి ఫ్రాంచైజీలకు టెన్షన్ తెప్పించింది. ఎప్పటిలానే కావ్యా పాప ఎక్స్ ప్రెషన్స్ మరోసారి అందరినీ కట్టిపడేశాయి.
ఇక వేలంలో అందరినీ తనవైపు తిప్పుకున్న బ్యూటీ కోల్ కత్తా నైట్ రైడర్స్ కో ఓనర్ జూహీచావ్లా కుమార్తె జాహ్నవి మెహతా…తన అభినయంతో చూపు తిప్పుకోకుండా చేసింది. చిరునవ్వులు చిందుస్తూ వేలంలో అందరి దృష్టి తనవైపు ఉండేలా చేసుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పాల్గొన్పటికీ.. ఇప్పుడు అభిమానులకు తెగ నచ్చేసింది. తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో యాక్టివ్‌గా వ్యవహరించింది. ఆమె చార్మింగ్‌తో కెమెరాలన్నీ అటువైపే ఫోకస్ చేశాయి. కేవలం బ్యూటీగానే కాదు వేలంలో పక్కా ప్లానింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. జాహ్నవి మెహతా…. ముఖ్యంగా వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా 23.75 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడానికీ వెనుకాడలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా అయ్యర్ ను తీసుకుంది.
మరోవైపు ఎప్పటిలానే పంజాబ్ కింగ్స్ కో ఓనర్, బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతా సైతం వేలంలో తళుక్కున మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో వేలంలో పార్టిసిపేట్ చేసిన ప్రీతిజింతా వ్యూహాత్మకంగా ప్లేయర్స్ ను సొంతం చేసుకుంది. పర్స్ లో పెద్ద మొత్తమే ఉండడంతో పలువురు స్టార్ ప్లేయర్స్ కు ప్రీతిజింతా భారీగానే బిడ్డింగ్ వేసింది. ఈ క్రమంలో ప్రీతి జింటా స్ట్రాటజీని పూర్తిగా మార్చి, బలమైన కెప్టెన్ కోసం శ్రేయస్ అయ్యర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్ మ్యాచ్ లు ఎప్పుడు ఎక్కడ జరిగినా డగౌట్ లో సందడి చేసే ప్రీతిజింతా తమ టీమ్ టైటిల్ కల ఈ సారైనా నెరవేరుతుందని ఎదురుచూస్తోంది. దీని కోసమే వేలంలో తమదైన ప్లానింగ్ తో ముందుకెళుతోంది. ఇక వేలాన్ని నిర్వహిస్తున్న మల్లికా సాగర్ తో కలిపి ఈ ముద్దుగుమ్మలంతా ఐపీఎల్ మెగా ఆక్షన్ కు మరింత కలర్ ఫుల్ నెస్ తెచ్చారు.