Capsule Hotel : హైబ్రీడ్ హోటల్.. పెట్టెల్లో నిద్రపోదాం..

ఈ క్యాప్సుల్‌ హోటల్స్‌.. సింపుల్‌గా చూడడానికి చిన్నసైజులో ఉండే బెడ్‌రూమ్స్‌తో కూడిన కాంప్లెక్స్‌.. జపాన్ లో పెరుగుతున్న డిమాండ్. మూడేళ్లలోనే జపాన్‌ వ్యాప్తంగా విస్తరణ

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2023 | 05:53 PMLast Updated on: Sep 04, 2023 | 5:53 PM

These Capsule Hotels Complexes With Small Sized Bedrooms To Look Simple Growing Demand In Japan Expansion Across Japan Within Three Years

ఈ ఫోటో కొంచెం వింతంగా కనిపిస్తోంది కదూ.. ఇది జపాన్ లోని ట్యోక్యోనగరంలో ఇటివంటి క్యాప్సూల్ హోటల్ వెలిసాయి. ఇవి అచ్చం రైలు, స్లీపర్ బస్ కూపేల్లా ఒకదాని పై మరొకటి, ఒకదాని పక్కన మరొకటి ఇలా ఒక్కో హోటల్ లోను వందలాది గూళ్లు కనిపిస్తాయి. అచ్చం బెర్త్ సైజులో ప్రతి ఒక్కరికి ఒక గది ఉంటుంది. ఒక్కో గదిలో టీవీ, ఇంటర్నెట్‌, అలారం క్లాక్స్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఎలా ఉంటుంది.. వీటిలో ఎలా ఉండాలి అంటే ఇది చదవాల్సిందే మరి..

వీటి నిర్మాణం..

(క్యాప్సూల్ హోటల్) వీటినే ‘పాడ్ హోటల్స్‌’ అంటారు.
జపాన్ లోని తొలి క్యాప్సూల్ హోటల్ 1979 లో జపనీస్‌ ఫేమస్‌ ఆర్టిటెక్ట్‌ కీషో కురోకావా ఈ హోటల్‌ని డిజైన్‌ చేస్తే అందరూ వింతగా చూశారు. చాలా కాలం తర్వాత ఇలాంటి హోటళ్లు విరివిగా ఏర్పడటంతో జనాలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నిజానికి ఈ క్యాప్సుల్‌ హోటల్స్‌.. సింపుల్‌గా చూడడానికి చిన్నసైజులో ఉండే బెడ్‌రూమ్స్‌తో కూడిన కాంప్లెక్స్‌లివి. ఒక చిన్న ఛాంబర్‌లో మినిమమ్‌ ఫెసిలిటీస్‌తో వీటిని నిర్మాణం చేశారు. హోటల్స్‌తో పోలిస్తే రేటు వీటి సౌకర్యం ఎక్కువ ధరలు మాత్రం చాలా తక్కువ. లగేజ్‌ పెట్టుకోవడానికి వీలుగా లాకర్‌ సదుపాయం ఉంటుంది. బాత్రూమ్‌ లు మాత్రం.. అందరూ కలిపి వాడుకునేలా ఏర్పాట్లు చేశారు.

ఏవరు ఎక్కువ వాడుతారు ..?

ఇటీవంటి పాడ్ హోటల్స్‌ ని చాలా వరకు ఇంటి నుంచి సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు వీటిని ఎక్కువగా వినియోగించుకుంటారు. రైల్వే కార్యకలాపాలు స్పష్టంగా చెప్పాలంటే అర్ధరాత్రి తర్వాత, మెట్రో నగరాల్లో అక్కడికి వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు, కొన్నిసార్లు తెల్లవారుజామున 1 గంటలకు పనులు ముంగించుకోని వచ్చే వ్యక్తులు ఇంటికి వెళ్లలేరు,ఈ సమయంలో క్యాబ్ తీసుకోవడం పెద్ద సాహసమే, అటువంటి వారు ఈ క్యాప్సూల్ హోటల్ విశ్రాంతి తీసుకుంటారు.
కాలం మారుతున్న కొద్ది అటువంటి వారికే కాకుండా మధ్యకాలంలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోనూ ఈ క్యాప్సుల్‌ హోటల్స్‌ పర్యాటకులు వీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

వీటి ధరలు ఎంత.. ?

ఇందులో బస చేసేందుకు ఒక వ్యక్తికి 2 వేల రూపాయల నుంచి 4 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ధరలు చౌకగా ఉండటంతో వీటికి జపాన్ లో మంచి డిమాండ్ పెరుగుతోంది. ఇక సూదూర ప్రాంతాల్లో పనుల నిమిత్తం వెళ్లిన వారు తీరిగి తమ ఇంటికి చేరుకోలేక నిరుద్యోగులు, చిరుద్యోగులు, చిరువ్యాపారులు వీటిల్లోనే రాత్రిళ్లు పడుకోవడానికి ఎంచుకుంటున్నారు. ఈ వి ప్రారంభించినప్పటి నుంచి.. కేవలం మూడేళ్లలోనే జపాన్‌ మొత్తం మీద నలభైకి పైగా క్యాప్సుల్ హోటల్స్ వెలిశాయి. ఇక అక్కడి నుంచి ప్రపంచం మొత్తం విస్తరించాయి.

వివిధ దేశాలలో వీటి వినియోగం..

జపాన్ లో మొదలైన ఈ ట్రెండ్‌.. చైనా, హాంకాంగ్‌, బెల్జియం, ఇండోనేసియా, పోలాండ్స్‌,యూరోప్‌లో అక్కడక్కడ ఎయిర్‌పోర్ట్ దగ్గరల్లో క్యాప్సూల్స్‌ హోటల్స్ కనిపిస్తాయి. చివరికి మన ఇండియా కి కూడా విస్తరించాయి. మన దేశంలోనూ క్యాప్సుల్ హోటల్‌ని ‘అర్బన్‌ పాడ్’ పేరుతో ముంబైలోని అంధేరీ ఏరియాలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా టూరిస్టుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పందనతో ఇండియాలో మరిన్ని చోట్ల క్యాప్సుల్ హోటల్స్‌ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

S.SURESH