Vallabhaneni Vamsi : దేశంలోనే ఉన్నాడా.. పారిపోయాడా.. వల్లభనేని వంశీ ఎక్కడ..
గన్నవరం (Gannavaram) మాజీ ఎమ్మెల్యే (Former MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అరెస్ట్ అంటూ.. రెండురోజులుగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.

They are in the country.. Did he run away.. Where is Vallabhaneni Vamsi..
గన్నవరం (Gannavaram) మాజీ ఎమ్మెల్యే (Former MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అరెస్ట్ అంటూ.. రెండురోజులుగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. సినీ ఫక్కీలో వంశీ వాహనాలను వెంబడించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారని మొదట్లో ప్రచారం జరగగా.. అది నిజం కాదని తేలింది. దీంతో ఇప్పుడు వంశీ ఎక్కడ అనే ప్రచారం జోరు మీద సాగుతోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయనను అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. ఐతే వంశీ ప్రధాన అనుచరులు యూసఫ్ పఠాన్ (Yusuf Pathan), సర్నాల రమేశ్‌ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని.. ఇప్పటివరకు 19మందిని అరెస్టు చేశామని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
దీంతో వంశీ ఎక్కడ ఉన్నాడన్న అంశం ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో ఆసక్తి రేపుతోంది. 2023, ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి దిగారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా.. పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపించాయ్. ఐతే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ దాడి కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరికి బెయిల్ కూడా వచ్చింది. ఈ కేసులో 71వ నిందితుడిగా వంశీ పేరు ఉంది. మరి వంశీని అరెస్టు చేస్తారా.. లేదా అనేది రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐతే వంశీ ఎక్కడ.. ఎందుకు బయటకు రావడం లేదు. ఆయన ఇండియాలోనే ఉన్నారా.. లేదంటే దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారా.. వంశీ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో కొత్త ప్రచారం ఊపందుకుంది. ఇక అటు వంశీ అరెస్టుపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయ్.
ఈ నెల 2న వంశీ సతీమణి గన్నవరం వచ్చారు. వంశీ ఉపయోగించే కాన్వాయ్‌లోనే.. ఆమె తన బంధువుల ఇంటికి వెళ్లారు. వంశీ వచ్చారన్న సందేహంతో పోలీసులు ఆ వాహనాలను తనిఖీ చేశారు. దీంతో వంశీని అరెస్టు చేశారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. ఐతే వంశీ అసలు ఎక్కడ ఉన్నారన్న దానిపై ఆయన అనుచరులే భిన్న కథనాలను ప్రచారం చేస్తున్నారు. వంశీ అమెరికా వెళ్లిపోయారని ఆయన సన్నిహితుల్లో కొందరు ప్రచారం చేస్తుండగా, వంశీ ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చారని.. ప్రస్తుతం రాజస్థాన్, బెంగళూరులో ఉంటున్నారని ఆయన అనుచరుల్లోనే మరో వర్గం చెబుతోంది.