ఇది కావ్యా పాప మార్క్, తొలిరోజు SRH కొన్నది వీళ్ళనే
ఐపీఎల్ మెగావేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిరోజు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ తనదైన మార్క్ తో ఏడుగురు ప్లేయర్స్ ను సొంతం చేసుకుంది.

ఐపీఎల్ మెగావేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిరోజు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ తనదైన మార్క్ తో ఏడుగురు ప్లేయర్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం ఏడుగురు ప్లేయర్లలో ముగ్గురు బ్యాటర్లు.. ముగ్గురు బౌలర్ల, ఒక వికెట్ కీపర్‌ను కొనుగోలు చేసింది. టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను అత్యధికంగా 11.25 కోట్లకు దక్కించుకుంది. భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ కోసం10 కోట్లు వెచ్చించింది. అలాగే హర్షల్ పటేల్ ను 8 కోట్లకు, యువ ఆటగాడు అభినవ్ మనోహర్ ను 3.2 కోట్లకు , ఆడమ్ జంపాను 2.4 కోట్లకు తీసుకుంది. ఇక రాహుల్ చాహర్ కోసం 3.2 కోట్లు పెట్టిన సన్ రైజర్స్ యంగ్ ప్లేయర్ అథర్వ తైదేను 30 లక్షలకు తీసుకుంది.