టాటాకు ఆఖరుగా వైద్యం చేసింది వీళ్లే ఆయన చివరగా ఏం చెప్పారంటే..
ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు అందరికన్నా గొప్పోడు. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం రతన్ టాటా. లక్షల కోట్లకు అధిపతి ఐనా.. పక్కవాళ్లతో ఆయన ఉండే సింప్లిసిటీ ప్రతీ ఒక్కరినీ ఆయనకు అభిమానులను చేస్తుంది. అంతటి ఉన్నతమైన మనిషి కాబట్టే ఆయన చనిపోయినప్పుడు దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు అందరికన్నా గొప్పోడు. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం రతన్ టాటా. లక్షల కోట్లకు అధిపతి ఐనా.. పక్కవాళ్లతో ఆయన ఉండే సింప్లిసిటీ ప్రతీ ఒక్కరినీ ఆయనకు అభిమానులను చేస్తుంది. అంతటి ఉన్నతమైన మనిషి కాబట్టే ఆయన చనిపోయినప్పుడు దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. అలాంటి టాటాకు ఆఖరిగా సాంప్రదాయ వైద్యం చేసిన ఇద్దరు దంపతులు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2019లో రతన్ టాటా కొన్ని రోజులపాటు సాంప్రదాయ వైద్యం చేయించుకున్నారు. ఆయనకు వైద్యం చేసింది తమిళనాడులోని కోయంబత్తూరులోని మరుధమలైకి చెందిన కోము లక్ష్మణన్, ఆయన మనోన్మణి. వర్మమ్ థెరపీ అనే సాంప్రదాయ వైద్యాన్ని టాటాకు చేశారు ఈ దంపతులు. వర్మమ్ థెరపీ అంటే తల నుంచి కాళ్ల వరకూ బ్లడ్ సర్క్యూలేషన్‌ను మెరుగుపరిచే చికిత్స. తమిళనాడులో వీళ్ల వైద్యం చాలా ఫేమస్ అని తెలిసి టాటా సన్స్ డైరెక్టర్ ఆర్‌కే కృష్ణకుమార్ వీళ్లను ముంబైకి పిలిపించారట.
రోజు రెండు గంటల పాటు వీళ్లిద్దరూ టాటాకు వైద్యం చేసేశారట. వీళ్ల విధానం టాటాను చాలా ఇంప్రెస్ చేసిందట. వీళ్లద్దరూ టాటాకు వైద్యం చేస్తున్నంతసేపై వాళ్ల కుటుంబం గురించి సాంప్రదాయ వైద్యం గురించి చాలా విషయాలు అడిగి టాటా తెలుసుకునేవారట. అన్ని సంస్థలకు అధిపతి ఐనా టాటా వాళ్లతో మాట్లాడిన తీరును ఇప్పటికీ తాము మర్చిపోలేమని చెప్తున్నారు లక్ష్మణన్ దంపతులు. మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగిన ప్రశ్నకు ఓ స్నేహితుడిలా సమాధానం చెప్పారట టాటా. విధి ఆడిన వింత నాటకంలో తాను ఇలా మిగిలిపోయానని చెప్పారట. ఆయన చెప్పిన ఆ సమాధానంతో టాటా మీద ఎంతో గౌరవం పెరిగిందని చెప్తున్నారు లక్ష్మణన్ దంపతులు. అలాంటి గొప్ప మానవతావాదిని కోల్పోవడం నిజంగా ఈ దేశానికి తీరని లోటని చెప్తూ టాటాతో వాళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.