Nagarjuna : అభిమానికి నాగార్జున క్షమాపణలు
సినీ, క్రీడా రంగాలకు చెందిన వారికి అనేక మంది అభిమానులుంటారు. అభిమాన సెలబ్రిటీలను ప్రత్యక్షంగా కలవాలని.. వారితో ఫొటో దిగాలని, కుదిరితే మాట్లాడాలని భావించే ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు.
సినీ, క్రీడా రంగాలకు చెందిన వారికి అనేక మంది అభిమానులుంటారు. అభిమాన సెలబ్రిటీలను ప్రత్యక్షంగా కలవాలని.. వారితో ఫొటో దిగాలని, కుదిరితే మాట్లాడాలని భావించే ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అభిమానులకు ఇలాంటి కోరికలు ఉండటం ఎంత సహజమో.. ఫ్యాన్స్ ఇలా ఎగబడితే సెలబ్రిటీలు తీవ్రంగా ఇబ్బండి పడతారు అనేది కూడా అంతే వాస్తవం. అందుకే సెలబ్రిటీలు బయటకు వెళ్తే.. కచ్చితంగా తమతో పాటు బాడీ గార్డులు ఉంటారు. అభిమానులు దగ్గరకు వచ్చి ఇబ్బందిపెట్టకుండా చూసుకుంటారు. అయితే కొన్నిసార్లు వీళ్లు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల సెలబ్రిటీలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. తాజాగా కింగ్ నాగార్జునకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో ఆయన ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు
నాగార్జున విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా.. ఓ దివ్యాంగ అభిమాని నాగ్‌ను కలిసేందుకు ప్రయత్నం చేశాడు. అది గమనించిన బాడీగార్డ్.. అతడిని నిర్దాక్షిణ్యంగా పక్కకు లాగేశాడు. పాపం అతడు కింద పడిపోయే పరిస్థితి నెలకొని ఉంది. ఆ సమయంలో ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చినట్లు వీడియోలో కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విటర్ లో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో.. దీనిపై నాగార్జున స్పందించారు.
ఈ ఘటన దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు. సదరు వ్యక్తికి… క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను అని నాగార్జున పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.