HEMA BEDIRIMPU : నా పేరు చెప్పారో… సూసైడ్ చేసుకుంటా పోలీసులకు హేమ వార్నింగ్
బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా దొరికిన నటి హేమ... నేను అక్కడ లేను... హైదరాబాద్ లో ఉన్నా అంటూ ఫేక్ వీడియోలు పెట్టి ఆ తర్వాత అడ్డంగా బుక్కయింది.

They said my name... Hema warned the police if they commit suicide
బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా దొరికిన నటి హేమ… నేను అక్కడ లేను… హైదరాబాద్ లో ఉన్నా అంటూ ఫేక్ వీడియోలు పెట్టి ఆ తర్వాత అడ్డంగా బుక్కయింది. బెంగళూరు పోలీసులు హేమ ఫోటో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇవ్వడంతో షాక్ అయింది. పోలీస్ కస్టడీలో ఉన్న హేమ… కుటుంబసభ్యులకు ఈ విషయం చెబుతానంటే ఫోన్ ఇచ్చామనీ… అప్పుడే వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టిందని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హేమ తన పేరు బయటకు రాకుండా మాగ్జిమమ్ ట్రై చేసింది. వీడియో రిలీజ్ చేసినా వర్కవుట్ కాలేదు. అంతకంటే ముందు బెంగళూరు పోలీసులకు కృష్ణవేణి అని తన అసలు పేరు చెప్పి బురిడీ కొట్టించింది.
ఆ పేరుతో బయటపడిపోవాలని ప్రయత్నించింది. రేవ్ పార్టీకి కూడా అదే పేరుతో అటెండ్ అయింది. అంతేకాకుండా… హేమ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్న టైమ్ లో… తన పేరు బయటపెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెంగళూరు పోలీసులను బెదిరించినట్టు తెలుస్తోంది. ఉదయం ఫోటోలో, వీడియోలో కనిపించిన డ్రెస్సుతోనే హేమ సాయంత్రం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. మీడియా నుంచి తప్పించుకొని… ఓ ప్రైవేట్ వెహికిల్లో హైదరాబాద్ కి బయల్దేరినట్టు సమాచారం.
బెంగళూరు టు హైదరాబాద్ కి వచ్చే రూట్ లో చెక్ పోస్టులు, టోల్ గేట్ల దగ్గర మాగ్జిమమ్ తన ఐడెంటిటీ బయటపడకుండా హేమ జాగ్రత్తలు తీసుకుంది. ముఖానికి మాస్క్ వేసుకున్నట్టు సమాచారం. అయితే హేమ తరుచుగా బెంగళూరుకు వచ్చిపోతుందని ఆమె ఫ్రెండ్స్ చెబుతున్నారు. రేవ్ పార్టీ ఈవెంట్ ఆర్గనైజర్ వాసు, చిరంజీవి ఆమెకు క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు. రేవ్ పార్టీకి అటెండ్ అయిన సినీ నటులు, మోడల్స్ తో హేమకు పరిచయాలు ఉన్నాయని సమాచారం. ఈ కేసు ఎంక్వైరీ కోసం హేమ బెంగళూరు పోలీసుల ముందు మరో మూడు రోజుల్లో హాజరు కావాల్సి ఉంది.