RRR Movie: కుట్రకి ఈ సారి.. “ఆస్కారం” లేదు..
జక్కన్న టీం త్రిబుల్ఆర్ ని చాలా కేటగిరీల్లో ప్రైవేట్ గా అప్లై చేస్తే, కనీసం బెస్ట్ సాంగ్ కేటగిరీలోనైనా అవార్డు దక్కింది.
లాస్ట్ ఇయర్ ఆస్కార్ రేసులో త్రిబుల్ ఆర్ ఉంటుందనుకుంటే, మనదేశం తరపున అఫీషియల్ ఎంట్రీ గా చల్లోని పంపించారు. ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ కి వచ్చిన గుర్తింపుని పక్కన పెట్టి అడ్రస్ లేని ఆర్ట్ ఫిల్మ్ ని అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ రేసులో పెట్టారనే కామెంట్లు వచ్చాయి.
అయినా జక్కన్న టీం త్రిబుల్ఆర్ ని చాలా కేటగిరీల్లో ప్రైవేట్ గా అప్లై చేస్తే, కనీసం బెస్ట్ సాంగ్ కేటగిరీలోనైనా అవార్డు దక్కింది. దేశం తరపున అఫీషియల్ ఎంట్రీగా వెళ్లుంటే ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో మరో అవార్డ్ దక్కేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఏదేమైనా ఈ ఏడాది లాస్ట్ ఇయర్ లా కాకుండా కాస్త కంటెంట్ ఉన్న సినిమానే ఆస్కార్ రేసులో పెట్టారంటున్నారు.
మలయాళం లో 200 కోట్లు రాబట్టిన మూవీ 2018ని భారత్ తరపున ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీగా పంపించారు. కేరళాను ముంచేసిన వరదల కాన్సెప్ట్ తోతెరకెక్కిన బయోపిక్ లాంటి ఈ సినిమా బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఈసారి ఆస్కార్ బరిలోకి దిగుతోంది. మున్నాల్ మురళీ ఫేం టీవినో థామస్ నటించిన ఈ సినిమాకు ఆస్కార్ అర్హతలు మెండుగా ఉన్నాయి. అటు ఆర్టిస్టిక్ గా, ఇటు రియలిస్టిక్ గా ఉండటంతో పాటు ఎమోషనల్ డ్రామాగా మంచి పేరు గుర్తింపు దక్కించుకుంది ఈ సినిమా.. కాబట్టే బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ రేసులో దూసుకెళ్లే అవకాశాలే ఎక్కువున్నాయంటున్నారు.