ఇదేమీ పెద్ద ఓటమి కాదు, రుతురాజ్ చెన్నై ఫాన్స్ ఫైర్
ఐపీఎల్ 18వ సీజన్ ను విజయంతో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ కు తమ హోం గ్రౌండ్ లోనే షాక్ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆ జట్టును ఓడించింది. అయితే కనీస పోటీ లేకుండా ఓడిపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

ఐపీఎల్ 18వ సీజన్ ను విజయంతో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ కు తమ హోం గ్రౌండ్ లోనే షాక్ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆ జట్టును ఓడించింది. అయితే కనీస పోటీ లేకుండా ఓడిపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యలు ఆ జట్టు అభిమానులను మరింత అసంతృప్తికి గురిచేశాయి. దీనికి కారణం రుతురాజ్ గైక్వాడ్ ఆర్సీబీపై 50 పరుగుల తేడాతో ఓటమి గురించి మాట్లాడడమే. టీ20 మ్యాచ్‌లలో 50 పరుగుల తేడాతో ఓడిపోవడం కచ్చితంగా దారుణమైన ఓటమే. కానీ ఋతురాజ్ మాత్రం దీనిని తేలిగ్గా తీసుకున్నట్టు కనిపించింది.
ఈ ఓటమిపై తాము ఎలాంటి ఆందోళనకు గురి కావడం లేదని.. ఇది పెద్ద మార్జిన్ కూడా కాదని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. పెద్ద తేడాతో ఓడిపోలేదని.. కేవలం 50 పరుగుల తేడాతో ఓడియామని పేర్కొన్నాడు. చెపాక్ స్టేడియం పిచ్ పై ఆర్సీబీని 170 పరుగులకే పరిమితం చేస్తామనుకున్నామని.. ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని గైక్వాడ్ తెలిపాడు. 170 పరుగుల లక్ష్యం ఛేదించాల్సి వచ్చినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుందని.. కానీ తాము అదనంగా 20 పరుగులు ఇచ్చామని అన్నాడు. అయినా తాము 50 పరుగుల తేడాతోనే ఓడిపోయామని.. ఇదేమీ భారీ మార్జిన్ కాదన్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ చేసిన కామెంట్స్ అభిమానుల నుంచి విమర్శలకు గురైంది. 50 పరుగుల ఓటమిని సాధారణ ఓటమిలాగా అతను మాట్లాడటం పై చెన్నై అభిమానులు మండిపడ్డారు. హార్దిక్ పాండ్యా గతంలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒక షాకింగ్ ప్రకటన చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఓటమి గురించి హార్దిక్ పాండ్యాను అడిగినప్పుడు.. ఓటమిలో కూడా ప్రత్యేకంగా ఉండడం సరైన విషయమని చెప్పాడు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా బాధ్యతారహితంగా మాట్లాడాడని చాలా మంది విమర్శించారు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దాదాపు అలాంటి తరహాలోనే మాట్లాడాడని చాలా మంది ఎత్తిచూపారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. సీనియర్లు స్పిన్నర్లు జడేజా, అశ్విన్.. ఆర్సీబీ బ్యాటర్ల దెబ్బకు తేలిపోయారు. రెండో ఇన్నింగ్స్ వన్డే వే ట్రాఫిక్ లా సాగింది. సీఎస్కే బ్యాటింగ్ యూనిట్ అంతా ఆర్సీబీకి సరెండర్ అయిపోయింది. హేజిల్‌వుడ్ సీఎస్కే పతనాన్ని శాసించాడు. ఇతర బౌలర్ల యశ్ దయాళ్ , లివింగ్‌స్టన్ మంచి ప్రదర్శన చేయడంతో 17 ఏళ్ల తర్వాత చెపాక్ లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించింది.