సైఫ్‌ అలీ ఖాన్‌ బ్యాగ్రౌండ్‌ ఇదే, ఆస్తులే దాడికి కారణమా ?

సైఫ్‌ అలీ ఖాన్‌ మీద జరిగిన దాడి బాలీవుడ్‌లో ఓ సంచలనం రేపిందనే చెప్పాలి. ఎంతో సేఫ్‌ అని చెప్పే ఏరియాలో మరెంతో సెక్యూరిటీ ఉండే స్టార్‌ హీరో మీద అతని జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 17, 2025 | 03:39 PMLast Updated on: Jan 17, 2025 | 3:39 PM

This Is Saif Ali Khans Background Was His Property The Reason For The Attack

సైఫ్‌ అలీ ఖాన్‌ మీద జరిగిన దాడి బాలీవుడ్‌లో ఓ సంచలనం రేపిందనే చెప్పాలి. ఎంతో సేఫ్‌ అని చెప్పే ఏరియాలో మరెంతో సెక్యూరిటీ ఉండే స్టార్‌ హీరో మీద అతని జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. నిందితుడు ఎందుకు దాడి చేశాడు అనే విషయం విచారణలో బయటికి వచ్చే అవకాశం ఉన్నా.. ఈ ఎటాక్‌ చుట్టూ ఎన్నో ఊహాగానుల వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైఫ్‌ మ్యారీడ్‌ లైఫ్‌ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 1970లో మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ, షర్మిలా ఠాకూర్‌ దంపతులకు జన్మించాడు సైఫ్‌. సైఫ్‌ తండ్రీ పటౌడీ ఇండియన్‌ క్రికెట్‌ టీంకు సారథిగా వ్యవహరించారు. 1991లో

సైఫ్‌ అమృత సింగ్‌ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో సైఫ్‌ కన్న పిల్లలే సారా అలీ ఖాన్‌, ఇబ్రహీం అలీ ఖాన్‌. ఈ రెండు పేర్లు సినీ అభిమానులకు కొత్తేం కాదు. సారా ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది. తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చినా తనకంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకుంది. వీళ్లతో ఉంటుండగానే కరీనా కపూర్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపాడు సైఫ్‌. 2012లో అమృతకు విడాకులు ఇచ్చి కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. కరీనాతో కూడా సైఫ్‌కు తైమూర్‌, జహంగీర్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కరీనాతో కూడా సైఫ్‌కు వివాదాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపించాయి. త్వరలోనే వీళ్లు కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ బాలీవుడ్‌ కోడై కూసింది. కానీ వాళ్ల విషయంలో అదేం జరగలేదు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్న సైఫ్‌ ఆస్తుల విలువ దాదాపు 12 వందల కోట్లు. ఈ సంపదే సైఫ్‌కు ఇప్పుడు ఈ ప్రమాదం తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. సైఫ్‌ కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇది బయటి వ్యక్తులు సైఫ్‌ను టార్గెట్‌ చేసి చేయించిన ఎటాక్‌ అని పోలీసులు చెప్తున్నారు. సైఫ్‌ను కొందరు వ్యక్తులు కోటి రూపాయలు డిమాండ్‌ చేశారని.. ఆ డబ్బు ఇవ్వని కారణంగానే దాడి జరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ నిందితుడు దొంగతనానికి వచ్చి దొరికిపోయాననే భయంతో సైఫ్‌ మీద ఎటాక్‌ చేశాడని ఇంట్లో పని వాళ్ల పోలీసులు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులోనే ఉన్నాడు. విషయం ఏదైనా ఓ స్టార్‌ హీరో మీద తన ఇంట్లోనే ఇంత పెద్ద ఎటాక్‌ జరగడం ఇప్పుడు బాలీవుడ్‌ను వణికిపోయేలా చేసింది.