19 ఏళ్ళ కుర్రాడి అరంగేట్రం, ఆసీస్ తుది జట్టు ఇదే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆధిక్యంపై కన్నేసిన ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టుకు పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ఒకరోజు ముందే తమ తుది జట్టును ఆసీస్ ప్రకటించింది.మూడో టెస్టుతో పోలిస్తే తుది జట్టులో ఆస్ట్రేలియా రెండు మార్పులను చేసింది. ఓపెనర్ నాథన్ మెక్‍స్వానీని తప్పించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2024 | 03:45 PMLast Updated on: Dec 25, 2024 | 3:45 PM

This Is The Final Aussie Team A 19 Year Old Boys Debut

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆధిక్యంపై కన్నేసిన ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టుకు పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ఒకరోజు ముందే తమ తుది జట్టును ఆసీస్ ప్రకటించింది.మూడో టెస్టుతో పోలిస్తే తుది జట్టులో ఆస్ట్రేలియా రెండు మార్పులను చేసింది. ఓపెనర్ నాథన్ మెక్‍స్వానీని తప్పించింది. ఊహించినట్టుగానే 19 ఏళ్ళ యువ బ్యాటర్ కు తుది జట్టు చోటు కల్పించింది. ఈ మ్యాచ్‍తోనే అంతర్జాతీయ క్రికెట్‍లో అతడు అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా సామ్ కొన్స్‌టాస్ రికార్డు సృష్టించనున్నాడు. దేశవాళీ క్రికెట్‍‍లో కొన్స్‌టాస్ సత్తాచాటుతున్నాడు. న్యూసౌత్ వేల్స్ తరఫున ఇప్పటి వరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍ల్లో 718 పరుగులతో అదరగొట్టాడు కొన్స్‌టాస్. 2 సెంచరీలు, మూడు అర్ధ శతకాలు చేశాడు. ఆడింది తక్కువ మ్యాచ్‍లే అయినా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో సెలెక్టర్లు అతడికి ఛాన్స్ ఇచ్చేశారు. భారత్‍తో నాలుగో మ్యాచ్‍తో టెస్టు క్రికెట్‍లో అరంగేట్రం చేయనున్నాడు సామ్ కొన్స్‌టాస్. ఇటీవలే బిగ్‍బాష్ లీగ్‍లోనూ అడుగుపెట్టిన ఈ యువ సంచలనం సిడ్నీ థండర్స్ తరఫున తన తొలి మ్యాచ్‍లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

ఇదిలా ఉంటే ఈ సిరీస్ లో భారత్ కు తలనొప్పిలా మారిన ట్రావిస్ హెడ్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్‍తో టెస్టు సిరీస్‍లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‍లో రెండు సెంచరీలు బాదాడు. అయితే, మూడో టెస్టులో హెడ్‍కు గాయమైంది. దీంతో నాలుగో టెస్టుకు ఉంటాడా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, అతడు గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో నాలుగో టెస్టు తుదిజట్టులో హెడ్ కొనసాగాడు. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న హెడ్ పూర్తిగా కోలుకున్నాడు. ఫిట్‌నెస్ టెస్ట్‌ క్లియర్ చేయడంతో అతను తుది జట్టులోకి వచ్చాడు. ఇక గాయపడ్డ పేసర్ జోస్ హాజిల్‍వుడ్ స్థానంలో తుదిజట్టులో స్కాట్ బోలండ్‍కు ఆసీస్ తుది జట్టులో చోటు దక్కింది.

ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచేందుకే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు క్వాలిఫై కావాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. దీంతో తుది జట్టు ఎంపికలో ఆతిథ్య ఆసీస్ కూడా పక్కా ప్లానింగ్ తో వ్యవహరించింది. గత రెండు టెస్టుల్లోనూ కంగారూల ప్రదర్శన భారత్ కంటే మెరుగ్గా ఉండడంతో వారి కాన్ఫిడెన్స్ పెరిగింది.