KCR : ఆచూకీ తెలిపిన వారికి ఇదే బహుమతి.. షాక్ ఇచ్చిన గజ్వేల్..
కేసీఆర్ కనిపించడం లేదు.. ఆచూకీ చూపించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును. ఇదీ గజ్వేల్‌లో వెలిసిన పోస్టర్లు. అక్కడ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేసీఆర్ పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని.. గజ్వేల్‌కు రావడం మానేశారని హైలైట్ చేస్తూ.. బీజేపీ నేతలు గజ్వేల్‌లో వినూత్న నిరసన చేపట్టారు. గజ్వేల్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి సొంత నియోజకవర్గానికి కేసీఆర్ రావడం లేదని నిరసనలు చేశారు.

This is the gift for those who revealed the whereabouts.. Gajwel gave a shock..
కేసీఆర్ కనిపించడం లేదు.. ఆచూకీ చూపించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును. ఇదీ గజ్వేల్‌లో వెలిసిన పోస్టర్లు. అక్కడ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేసీఆర్ పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని.. గజ్వేల్‌కు రావడం మానేశారని హైలైట్ చేస్తూ.. బీజేపీ నేతలు గజ్వేల్‌లో వినూత్న నిరసన చేపట్టారు. గజ్వేల్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి సొంత నియోజకవర్గానికి కేసీఆర్ రావడం లేదని నిరసనలు చేశారు. గజ్వేల్ పట్టణంలో కేసీఆర్ కనబడడం లేదు అని పోస్టర్లు ముద్రించి అంటించారు. ఫ్లెక్సీలు పట్టుకొని నిరసనలు చేశారు.
కేసీఆర్ ఎక్కడున్నా గజ్వేల్‌కు రావాలి అంటూ నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ పోస్టర్లలో కేసీఆర్ బొమ్మతో పాటు ఆయన గుర్తులుగా తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు లేదా తెల్ల లుంగీ వేసుకుంటారని.. నెత్తి మీద టోపీ పెట్టుకుంటారని.. ఆయనో భయంకరమైన హిందువు అంటూ రాశారు. పైగా కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి అని.. ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి అని పోస్టర్లలో సెటైర్లు వేస్తూ రాసుకొచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ జనాల పేరుతో ఈ పోస్టర్లను ముద్రించారు. పూర్తిపేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని.. వయసు 70 సంవత్సరాలు… ప్రొఫెషన్ అబద్ధపు హామీలతో జనాలను మోసం చేయడం, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం… గుర్తులు తెల్లచొక్కా, తెల్ల ప్యాంట్ లేదా తెల్ల లుంగీ, నెత్తి మీద టోపీ అంటూ రాసుకొచ్చారు.
ఈ ఫ్లెక్సీలో ముఖ్య సూచన కూడా ఇచ్చారండోయ్. పైన ఫోటోలో ఉన్న వ్యక్తి గజ్వేల్ నియోజకవర్గానికి మూడోసారి శాసనసభ్యులుగా గెలిచిన క్షణం నుంచి నేటి వరకు గజ్వేల్ నియోజకవర్గానికి రాలేదు. ఎక్కడా కనిపించలేదు. ముఖ్యమంత్రి పదవి పోగానే బాధలో బాత్‌రూంలో జారి పడి కాలు విరిగిపోయిందని తెలిసింది. సారు కారు పదహారు అని ఎక్కడ పరారు అయ్యారో ఎలా ఉన్నాడో తెలియడం లేదు. దయచేసి ఎక్కడైనా కేసీఆర్ ఆచూకీ తెలిస్తే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించగలరు. కేసీఆర్ గారి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును. ఇట్లు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అని పోస్టర్‌లో ముద్రించారు.