కెప్టెన్ గా రుతురాజ్ రెస్టాఫ్ ఇండియా టీం ఇదే
ఇరానీ కప్ కోసం బీసీసీఐ రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను రెస్టాఫ్ ఇండియా సారథిగా ఎంపిక చేసింది. అభిమన్యు ఈశ్వరన్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
ఇరానీ కప్ కోసం బీసీసీఐ రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను రెస్టాఫ్ ఇండియా సారథిగా ఎంపిక చేసింది. అభిమన్యు ఈశ్వరన్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటీవల దులీప్ ట్రోఫీలో రాణించిన పలువురు ఆటగాళ్ళకు ఈ జట్టులో చోటు దక్కింది. సాయి సుదర్శన్, దేవదూత్ పడిక్కల్, ప్రసిధ్ధ కృష్ణ, ముఖేశ్ కుమార్ రెస్టాఫ్ ఇండియాకు ఎంపికయ్యారు. అలాగే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం ఎంపికైన ధృవ్ జురెల్, యశ్ దయాల్ కు కూడా చోటు లభించింది. బంగ్లాతో రెండో టెస్టులో వీరికి చోటు లేకుంటే ఇరానీ కప్ ఆడేందుకు రిలీజ్ చేస్తారు. అయితే తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డిలకు నిరాశే మిగిలింది. అక్టోబర్ 1 నుంచి ముంబై, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ జరుగుతుంది.