శ్రీవారి లడ్డూ చరిత్ర ఇదే, దిట్టం అంటే ఏంటీ…? లడ్డు ఎక్కడ తయారు చేస్తారు…?
దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఈ లడ్డు చరిత్ర ఏంటీ... ఈ లడ్డుని ఎలా తయారు చేస్తారో చూద్దాం. లడ్డు అనే పదం గురించి 12వ శతాబ్ది మానసోల్లాస గ్రంథంలో ప్రస్తావించారు.
దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఈ లడ్డు చరిత్ర ఏంటీ… ఈ లడ్డుని ఎలా తయారు చేస్తారో చూద్దాం. లడ్డు అనే పదం గురించి 12వ శతాబ్ది మానసోల్లాస గ్రంథంలో ప్రస్తావించారు. సంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టీకము అని పిలుస్తారు. తెలుగులో అడ్డుకము, లడ్వము, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక అంటారు. అని పిలుస్తారు. హిబ్రూ భాషలో LUD అనే పదంను లడ్డూకు సమానార్ధకంగా చెప్తారు పండితులు. ముద్దగా చేసిన దాన్ని లడ్డూ అని పిలుస్తారు.
లడ్డూ పోటులో ఈ లడ్డుని తయారు చేస్తారు. తిరుపతి ఆలయంలో మూలమూర్తి కొలువై ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు కంటే ముందు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పగా…. వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారు చేయడం జరుగుతుంది. అక్కడ తయారు చేసి ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకువెళ్ళి… అక్కడి నుంచి శ్రీవారి దగ్గరకు తీసుకు వెళ్ళడం జరుగుతుంది. 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలుపెట్టారు.
శ్రీవారి స్వామి ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే వస్తువులు, సరుకుల మోతాదును “దిట్టం” అని పిలుస్తారు. 1950లో టీటీడీలో దిట్టంను నిర్ణయించారు. భక్తుల రద్దీ పెరగడంతో దిట్టం పెరుగుతూ వచ్చింది. 2001లో సవరించిన దిట్టాన్ని ప్రస్తుతం ఫాలో అవుతారు. పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తారు. పడి అంటే 51 వస్తువులు అని అర్ధం. ముందు రోజుకు 5100 లడ్డూలు మాత్రమే తయారు చేయగా… దానికి సరిపడా పదార్ధాలను సమకూర్చేవారు. భక్తుల తాకిడి పెరిగిన తర్వాత అంటే 2001లో ఈ దిట్టంను పెంచారు అధికారులు.
2001 దిట్టం స్కేలు ప్రకారమే లడ్డూల తయారి జరుగుతోంది. 5100 లడ్డూల తయారీకి గాను 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. సరుకుల వివరాలు చూస్తే… ఆవు నెయ్యి – 165 కిలోలు, శెనగపిండి -180 కిలోలు, చక్కెర – 400 కిలోలు, యాలకులు – 4 కిలోలు, ఎండు ద్రాక్ష – 16 కిలోలు, కలకండ – 8 కిలోలు, ముంతమామిడి పప్పు – 30 కిలోలు వినియోగించి లడ్డూని తయారు చేస్తారు. ముందు కట్టెల పొయ్యి మీద చేసినా కట్టెల కొరత కారణంగా లడ్డుని ఇప్పుడు యంత్రాల సాయంతో చేస్తున్నారు.