Tirumala: తిరుమల ఆలయాన్ని ఫోటో తీసిన వ్యక్తి అరెస్ట్
తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి గోపురాన్ని వీడియో తీసిన వ్యక్తిని పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఈ వీడియో తీసింది కరీంనగర్ జిల్లాకు చెందిన రాహుల్ రెడ్డిగా గుర్తించారు. శేషపట్నంలో ఉండే రాహుల్ రెడ్డి.. చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. నిందితుడు వీడియో తీస్తున్న దృశ్యాలని సీసీ కెమెరాలో గుర్తించారు అధికారులు. అతని దర్శనం టికెట్, ఆధార్ కార్డు ద్వారా అడ్రెస్స్ కనుక్కున్నారు. రాహుల్ ట్రేస్ అవ్వడంతో వెంటనే అరెస్ట్ చేశారు. అసలు వీడియో తీయడానికి కారణం ఏంటి, సోషల్ మీడియాలో వీడియో పెట్టడానికి కారణం ఏంటి అనే అంశాలపై విచారణ చేపడుతున్నారు.
కేవలం ఆలయాన్ని మాత్రమే వీడియో తీశారా, లేక ఆలయ గర్భ గుడిలో కూడా వీడియోలు తీశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే రీసెంట్ గానే తిరుమల ఆలయం మీదనుంచి విమానం వెళ్లడం సంచలనంగా మారింది. నో ఫ్లైయింగ్ జోన్ నుంచి విమానం వెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయం తేలకముందే శ్రీశైలం ఆలయంపై డ్రోన్ ను గుర్తించారు స్థానికులు. ఇలా ఆలయ దగ్గర భద్రత వైఫల్యం కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే ఆలయ గోపురాన్ని రాహుల్ రెడ్డి వీడియో తీయడం మరోసరి సంచలనంగా మారింది. దేశంలోనే పేరుపొందిన దేవస్థానాల్లో ఒకటైన తిరుమలలో సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉంటుంది. వేల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉంటాయి. విజిలెన్స్ అధికారులను దాటి అసలు ఎలక్ట్రానిక్ వస్తువు లోపలికి ఎలా వచ్చింది అనేదే ఇప్పుడు ప్రశ్న. రాహుల్ దర్యాప్తులో పోలీస్ లు ఇంకా ఎలాంటి నిజాలు బయటికి తీస్తారో చూడాలి.