Ayodhya Ram Mandir: రామయ్య సన్నిధికి వెంకన్న ప్రసాదం.. అయోధ్యకు తిరుపతి లడ్డూలు..
స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తిరుపతి లడ్డూ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ప్రత్యేక ప్రసాదంగా దీన్ని పంచేందుకు రామ జన్మభూమి ఆలయ కమిటీ సిద్ధం అయింది. టీటీడీ కూడా లడ్డూల పంపిణీ ప్రక్రియకు అంతా సిద్ధం చేసింది.
Ayodhya Ram Mandir: కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. శ్రీ శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడు కూడా. అందుకే తిరుమల ఎప్పుడూ భక్త జనసందోహంగా ఉంటుంది. నిత్యం గోవింద నామాలతో సప్తగిరులు మారుమోగుతూనే ఉంటాయ్. త్రేతాయుగంలో రాముడైన ఆ పరంధామే.. కలియుగంలో ఆ శ్రీ వెంకటేశ్వరుడు అని ఎన్నో పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయ్. రాములోరి సన్నిధిలో వెంకన్న ప్రసాదం భక్తులను పలకరించబోతోంది.
Ayodhya Ram Mandir : అయోధ్య లో అందరికీ ఉచిత భోజనం..50 కోట్ల తో ప్రభాస్ దాతృత్వం
ఎన్నో అవరోధాల తర్వాత.. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రామ చంద్రమూర్తి ఆలయం అత్యంత వైభంగా తీర్చిదిద్దారు కళాకారులు. 22న ఆలయానికి ప్రాణప్రతిష్ట జరగబోతోంది. ఈ క్షణం కోసం దేశమంతా భక్తితో ఎదురుచూస్తోంది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశమంతా రామనామ జపం చేస్తోంది. ఈ నెల 22న శ్రీరామచంద్రుడి ఆలయంలో.. అర్చావతార మూర్తిగా ప్రతిష్టించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయ్. స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తిరుపతి లడ్డూ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ప్రత్యేక ప్రసాదంగా దీన్ని పంచేందుకు రామ జన్మభూమి ఆలయ కమిటీ సిద్ధం అయింది. టీటీడీ కూడా లడ్డూల పంపిణీ ప్రక్రియకు అంతా సిద్ధం చేసింది. లక్ష లడ్టూలను అయోధ్యకు పంపేందుకు టీటీడీ రెడీ అయిది.
ముందుగా 175 గ్రాముల సాధారణ లడ్డూలను పంపాలని భావించగా.. రవాణా కష్టంగా మారి లడ్డూ బూందిగా మారే అవకాశం ఉందని ఆలోచించారు. దీంతో ప్రత్యేకంగా 25 గ్రాముల చిన్న లడ్డూలను టీటీడీ తయారు చేయించింది. దాదాపు లక్షకు పైగా లడ్డూలను టీటీడీ అయోధ్యకు పంపిస్తోంది. శుక్రవారం నాటికి ఈ లడ్డూలు అయోధ్యకు చేరనున్నాయ్. స్వచ్ఛమైన దేశీ నెయ్యితో శ్రీ రామచంద్రమూర్తి ఆలయానికి తరలించేలా ప్రత్యేక లడ్డూలు తయారు చేశారు. దీనికో 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.