Actor Bernard Hill Died : ‘టైటానిక్’ షిప్ కెప్టెన్ కన్నుమూత
టైటానిక్ సినిమాలో షిప్ కెప్టెన్ (Ship Captain) గా అద్భుతంగా నటించి అందరికీ గుర్తుండుపోయిన నటుడు బెర్నార్డ్ హిల్. ఆయన వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు.

'Titanic' ship captain passes away
టైటానిక్ సినిమాలో షిప్ కెప్టెన్ (Ship Captain) గా అద్భుతంగా నటించి అందరికీ గుర్తుండుపోయిన నటుడు బెర్నార్డ్ హిల్. ఆయన వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పలు ఇంగ్లీష్ మీడియాలు ప్రచురించాయి. 79 ఏళ్ల వయసున్న ఆయన ఆదివారం మృతి చెందారు. దీంతో ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
బెర్నార్డ్ టాటైనిక్ (bernard titanic) సినిమాలో చాలా హుందా అయిన పాత్రలో నటించి అందరినీ మెప్పించారు. దీనితో పాటు లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ద టూ టవర్స్, ట్రయాలజీ లాంటి మంచి మంచి చిత్రాల్లో నటించారు. రిటర్న్ ఆఫ్ ది కింగ్ సినిమాలో ఆయన కనబరిచిన అత్యుత్తమ నటనకు గాను ఏకంగా పదకొండు ఆస్కార్ అవార్డుల్ని అందుకున్నారు.
ఈ సినిమాలు అన్నింటి కంటే ముందు వచ్చిన చిత్రం టైటానిక్. జేమ్స్ కామెరూన్ (james cameron) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షిప్ కెప్టెన్‌గా బెర్నార్డ్ అద్భుతంగా నటించారు. ఈయన ఒక్క సినిమాల్లోనే కాకుండా స్టేజ్ ఆర్టిస్ట్‌గానూ పని చేశారు. అలాగే ఇటు టీవీ షోల్లోనూ నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దాదాపుగా 50 ఏళ్లకు పైగా తన నట ప్రస్తానాన్ని కొనసాగించారు.