Telangana, BJP : నేడు తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. సిద్దిపేటలో అమిత్ షా భారీ సభ..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) ప్రచారం రసవంతంగా కొనసాగుతుంది.

Today BJP's top leaders for Telangana.. Amit Shah held a huge meeting in Siddipet..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) ప్రచారం రసవంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో సై అంటే సై అన్నట్లు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు ప్రచారం చేసేందుకు బీజేపీ అగ్రనేతలు సైతం రాష్ట్రానికి క్యూ కడుతున్నారు.
తెలంగాణలో నేడు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం BJP అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు పర్యటించనున్నారు. ఇవాళ లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) నామినేషన్ల దాఖలుకు ఆఖరిరోజు కావడంతో కరీంనగర్ నుంచి బండి సంజయ్, నాగర్ కర్నూల్లో పోతుగంటి భరత్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్.. నామినేషన్లు వేయనున్నారు. వీరి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ సీఎం (Uttarakhand CM) పుష్కర్ సింగ్ దామి (Pushkar Singh Dami) హాజరుకానున్నారు. ఇవాళ సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.
మరోవైపు PM మోదీ ఈనెల 30న జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలకు కలిపి సుల్తాన్పూర్లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మే 3న చౌటుప్పల్, 4న నారాయణపేట, వికారాబాద్ లేదా మరో ప్రాంతంలో జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత కూడా మరో 2-3 రోజులు ప్రచారం నిర్వహిస్తారని సమాచారం.