Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కలుపుతుంది. ప్రధాన పార్టీల అగ్ర నేతలు ప్రచారం వేగం పెంచారు. ప్రతి రోజూ నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షో లు నిర్వహిస్తున్నాయి పార్టీలు.

Today, Revanth Reddy will campaign in six constituencies.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కలుపుతుంది. ప్రధాన పార్టీల అగ్ర నేతలు ప్రచారం వేగం పెంచారు. ప్రతి రోజూ నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షో లు నిర్వహిస్తున్నాయి పార్టీలు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు ఆరు నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్..
- ఉదయం 10 గంటలకు నారాయణపేట్ బహిరంగ సభ,
- 11 గంటలకు దేవరకద్ర బహిరంగ సభ, మధ్యాహ్నం
- 12 గంటలకు మహబూబ్ నగర్ జనసభ.
- 2 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి కామారెడ్డి బహిరంగ సభ..
- సాయంత్రం 5.30 గంటలకు పఠాన్ చెరు జనసభ,
- 6.30 గంటలకు శేరిలింగంపల్లి సభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నిన్న కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనాయకుడు ఏఐసీసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.