Heavy Rain : నేడు.. రేపు రాష్ట్రంలో వర్షాలు.. మరో 48 గంటల్లో జంటనగరాల్లో వర్షం
నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు (Rain) పడనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు

Today.. tomorrow rains in the state.. rain in twin cities in next 48 hours
నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు (Rain) పడనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. కాగా, ఆవర్తనం కారణంగా నగరంలో ఆకాశం మేఘావృతంగా మారింది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాయంత్రం సమయాల్లో జంటనగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని IMD సూచించింది.