Zero shadow : నేడు హైదరాబాద్ లో జీరో షాడో ( శూన్యనీడ ) మాయం.. మధ్యాహ్నం 12.12 గంటలకు
ఇక పిల్లలైతే తమ నీడతో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మన నీడ మాయం అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి షాక్ అవుతున్నారా..? అయితే ఇది మీకోసమే.. కొన్ని సార్లు అలాంటి అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. నీడ మాయం అవ్వడం ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది..
నిడా.. మనందరికీ తెలుసు.. మనం ఉన్నంతవరకు మన నీడ మాత్రమే మనల్ని వదిలి పోదు అంటుంటారు పెద్దలు.. కానీ కొన్ని సందార్భాల్లో మన నీడా సైతం మాయం అవుతుంది. మన నీడ మనకే కనిపించదు.. మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. అనుక్షణం మన వెంటే ఉంటుంది.. మనం కూర్చున్నా నిలుచున్నా మన నీడ మన వెన్నంటే ఉంటుంది.
ఇక పిల్లలైతే తమ నీడతో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మన నీడ మాయం అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి షాక్ అవుతున్నారా..? అయితే ఇది మీకోసమే.. కొన్ని సార్లు అలాంటి అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. నీడ మాయం అవ్వడం ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మన నీడ ‘మాయం’ అవుతుంది! ఇలా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. దీనినే జీరో షాడో డే లేదా శూన్య నీడ అంటారు.
జీరో షాడో డే అంటే ఏంటి?
బెంగళూరులో ఇవాళ ‘జీరో షాడో (Zero shadow) డే’. మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు 6 నిమిషాల పాటు నీడ మాయం కానుంది. కాగా సూర్యుడు (sun) సరిగ్గా మన నెత్తిపై ఉన్నప్పుడు జీరో షాడో ఏర్పడుతుంది. దీని ఫలితంగా నిటారుగా ఉండే మనిషి, వస్తువు లేదా జంతువుల నీడలు కనిపించవు. మన నీడను మనమే కాదు.. పక్కవారు కూడా చూడాలేరు. సూర్యుడు +23.5,-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత జరుగుతుంది. జీరో షాడో డే సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుందని ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (Astronomical Society of India) తెలిపింది. ఇవాళ హైదరాబాద్లో ఈ శూన్యనీడ (Zero shadow) మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై 2, 3 నిమిషాల పాటు కొనసాగుతుందని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు తెలిపారు.
SSM