Chandramohan : నేడు పంజాగుట్ట స్మశాన వాటికలో సినీ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు
ఇవాళ టాలీవుడ్ సినీ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 12 గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Tollywood actor Chandramohan's last rites will be held today The family members revealed that the cremation will take place at Panjagutta graveyard at 12 am
తెలుగు సీనియర్ సినీ నటుడు.. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ అనారోగ్య శనివారం 82 ఏళ్ల వయసులో ఉదయం 9.45 నిమిషాలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస టాలీవుడ్ లో విషాద చాయాలు అలుముకుంటున్న నేపథ్యంలో చంద్రమోహన్ మరణ వార్త ఫిల్మ్ ఇంటస్టీలో తీవ్ర విషాద చాయాలు అలుముకున్నాయి. ఆయన చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున్న ఆయన ఇంటికి తరలి వస్తున్నారు.
ఇవాళ టాలీవుడ్ సినీ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 12 గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా ఫిల్మ్ నగర్ లోని చంద్రమోహన్ ఇంటి నుంచి ఉదయం 11 గంటలకు అంతిమ యాత్ర సాగుతుందని కుటుంబ సభ్యలు తెలిపారు. చంద్రమోహన్ పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచుతారు అన్న వార్తల్లో నిజం లేదు అని కుటుంబ సభ్యలు తెలిపారు. పార్ధివ దేహాన్ని ఇంటి నుంచి నేరుగా..పంజాగుట్ట శ్మశానవాటికకు తీసుకెళ్తామని తెలిపారు. ఇక చంద్రమోహన్ పెద్ద కుమార్తె అమెరికా నుంచి ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. చంద్ర మోహన్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమార్తె అమెరికాలో సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. చంద్రమోహన్ అంతిమ సంస్కారాలు ఆయన తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించనున్నారు.