Mass Maharaja Ravi Teja : ఛాన్స్ వస్తే అతడి బయోపిక్ చేస్తా..
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మెరిశాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్‌లో కామెంటేటర్ అవతారం ఎత్తాడు. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు క్రికెట్ లైవ్ కామెంటరీలో పాల్గొన్నాడు రవితేజ.

Tollywood mass maharaja Ravi Teja shined in India Australia match. He took on the avatar of a commentator on Star Sports Telugu Cricket Live. Comments that he will act in Mohammed Siraj's biopic
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మెరిశాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్‌లో కామెంటేటర్ అవతారం ఎత్తాడు. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు క్రికెట్ లైవ్ కామెంటరీలో పాల్గొన్నాడు రవితేజ. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన క్రికెటర్లు ఎవరో చెప్పారు. విరాట్ కోహ్లీ ఆటిట్యూడ్, దూకుడు అంటే కూడా చాలా ఇష్టమన్నాడు. కోహ్లీ బ్యాట్‌ను హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంలో, ఓ క్రికెట్ అభిమాని.. రవితేజను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే ఏ క్రికెటర్‌పై చేస్తారని అడిగాడు. దీంతో రవితేజ వెంటనే మహమ్మద్ సిరాజ్ అని చెప్పాడు. తనకు క్రికెటర్ బయోపిక్‌లో నటించే అవకాశమొస్తే.. తప్పకుండా సిరాజ్ బయోపిక్‌లో నటిస్తానని వెల్లడించాడు. విషయం తెలిసిన మియా ఫ్యాన్స్, రవన్నా థాంక్ యూ వెరీ మచ్ అంటూ కామెంట్స్ చేస్తూ, టైగర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.