Tamato: సామాన్యులకు షాక్.. టమాట ధరలు మరింత పెరిగే చాన్స్..
టమాట ధర కొండెక్కి కూర్చుంది. పేదవాడికి అందని వస్తువుగా మారిపోయింది. ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం కిలో టమాటా 120 రూపాయలకు పైగా పలుకుతోంది.

Tomato prices are likely to increase further due to heavy rains and lack of transportation facilities
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటున్నాయ్. కొన్ని చోట్ల కిలో టమాటా 250 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాల్లో టమాట ధరలు డబుల్ సెంచరీ దాటిన పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమాట బంగారంగా మారిపోయింది. సరైన నిల్వలు లేని కారణంగా అధిక ధరలకు అమ్ముడవుతోంది. మరికొన్ని రోజుల్లో దక్షిణాదిన కూడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వర్షాల కారణంగా టమాట ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కిలో టమాటా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో చోట ఒక్కో రేటు పలుకుతోంది.
కిలో 100 నుంచి 150 రూపాయలుగా ఉంటోంది. వర్షాలు బాగా పెరిగితే.. ఈ రేటు 200లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వర్షాల కారణంగా ఇప్పటికే చాలా ప్రాంతంలో పంట నష్టం అయింది. రోడ్డు బాగా దెబ్బతినటంతో కూరగాయల ట్రాన్స్‌పోర్టు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయ్. ముంబై లాంటి ప్రాంతాల్లో మరో రెండు రోజుల్లోనే టమాటా ధరలు 200లకు చేరే అకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయ్. అవాక్కయ్యే విషయం ఏంటంటే.. టమాటా ధరలు ఎంత పెరిగినా.. రైతులు లాభపడేది మాత్రం కొన్ని రోజులే. టమాటా ధరలు తగ్గిన తర్వాత మళ్లీ రూపాయికి, రెండు రూపాయలకు కిలో అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి తోడు వర్షాల కారణంగా పంట నష్టం జరిగి చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు చూసినా రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగులుతున్నాయి