సుందర్ పిచాయ్... గూగుల్ సీఈఓ... అలాంటివాడిని అవమానించిందో ఫ్లైట్ అటెండెంట్... అవతారాన్ని చూసి అతడ్ని అసహ్యించుకుంది. దారుణంగా ట్రీట్ చేసింది. కానీ అతనెవరో తెలిశాక... అతని మాటలు విన్నాక జై సుందర్.. జై ఇండియా అనుకోకుండా ఉండలేకపోయింది. ఇదేదో మసాలా ఉన్న స్టోరీ కాదు... సెన్సేషన్ స్టోరీ అంతకన్నా కాదు...బట్ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సినది. ఇది ఇప్పటిది కాదు కానీ ఎప్పటికీ గుర్తుండిపోయేదే... డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్..! అందరికీ తెలిసిన లైన్ ఇది. కవర్ చూసి పుస్తకాన్ని జడ్జ్ చేయకూడదు.. అవతారాన్ని చూసి మనిషిని అంచనా వేయకూడదు.... అలా వేస్తే ఏం జరుగుతుందో ఓ అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ అటెండెంట్‌కు బాగా అర్థమైంది. ఆమె మోస్ట్ పవర్‌ఫుల్ సీఈఓ సుందర్‌ను అవమానించింది. కానీ సుందర్ ఆమెకు జీవితకాల పాఠాన్ని నేర్పాడు. చాలా రోజుల క్రితం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్‌కు బయలుదేరాడు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లో తన సీటు దగ్గర కూర్చున్నాడు. నిజానికి తనయితే నార్మల్ జర్నీ చేసేవాడే. కానీ టికెట్ కంపెనీ బుక్ చేయడంతో అది ఫస్ట్‌క్లాస్ అయ్యింది. అయితే జీన్స్, బ్లాక్ టీషర్ట్‌లో సింపుల్‌గా ఉన్న సుందర్‌ను ఓ మామూలు మనిషి అనుకున్న సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ జెస్సికా పార్కర్ చాలా తక్కువగా వ్యవహరించింది. చుట్టూ చూస్తే అందరూ హైఫైగా ఉన్నవారే. కానీ సుందర్ పిచాయ్ మాత్రం నార్మల్‌గా ఉన్నాడు. ఒక్క మాటలేదు. సైలెంట్‌గా తన ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ పోతున్నాడు. అప్పటికే ఫ్లైట్ కూడా బయలుదేరింది. అయితే అప్పటికీ జెస్సికా అతడు ఫస్ట్‌క్లాస్‌లో జర్నీ చేయదగ్గ వ్యక్తి కాదనుకుంది. ఇన్నేళ్ల తన ఎక్స్‌పీరియన్స్‌లో ఇంత సింపుల్ వ్యక్తిని ఆమె చూడలేదు. దాంతో తనే రైటనుకుంది. మరోసారి సుందర్ దగ్గరకు వెళ్లి టికెట్ అడిగింది. అతనేం మాట్లాడకుండా తన టికెట్ చూపించాడు. అప్పటికీ కొందరు సుందర్ పిచాయ్‌ను గుర్తించారు. దీంతో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. దీంతో ఆమె ఇదేదో తేడా వ్యవహారం అనుకుని మరింత దబాయించింది. ఫస్ట్‌క్లాస్ జర్నీలో నీలాంటి వాళ్లు ఉండకూడదన్నట్లు మాట్లాడింది. చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా అప్పటికే అక్కడో ఏదో జరుగుతుందన్నట్లు చూస్తున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన జెస్సికా.. మీరు బిజినెస్ క్లాస్‌లో కూర్చోండి. అక్కడ మీకు సీటు ఎరేంజ్ చేస్తానంటూ మాట్లాడింది. ఇంత జరుగుతున్నా సుందర్ పిచాయ్ కోపం తెచ్చుకోలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. నెమ్మదిగా తన ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి ఆమెవైపు చూశాడు. ఇంతలో పక్కనున్న ఎవరో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ అంటూ కేకలు వేశారు. దీంతో జెస్సికా తలపై పిడుగుపడినట్లైంది. దీన్ని ఆమె నమ్మలేకపోయింది. చేతులు వణుకిపోయాయి. ఫస్ట్‌క్లాస్‌లో జరుగుతున్న గలాభా కెప్టెన్ దృష్టికి వెళ్లడంతో వెంటనే అక్కడకు వచ్చాడు. సుందర్‌కు సారీ చెప్పాడు. ఇక్కడితో కథ అయిపోలేదు. ఆ తర్వాత జరిగిందే అసలు విషయం... సుందర్ అన్న మాటలకు ఆ ఎయిర్ హోస్టెస్‌తో పాటు ఫ్లైట్‌లో ఉన్న వారంతా అలా చూస్తుండి పోయారు. హ్యాట్సాఫ్ సుందర్ అనడం మినహా వారి నోటి నుంచి మరో మాట రాలేదు. జెస్సికా తీరుపై కోపంగా ఉన్న మిగిలిన పాసింజర్స్ వెంటనే ఆమెపై కంప్లయిట్ చేయాలని సూచించారు. ముందు వరుసలో కూర్చున్న ఓ టాప్ హీరోయిన్ అయితే తప్పకుండా కంప్లయింట్ చేయమని ఫోర్స్ చేసింది. అయితే సుందర్ మాత్రం చాలా కూల్‌గా దాన్ని తిరస్కరించాడు. వాళ్లంతట వాళ్లు ఫూల్ అవుతారు కానీ వేరే ఎవరూ ఎవర్నీ ఫూల్ చేయలేరన్నాడు సుందర్. పుస్తకం కవర్ చూసి దాన్ని అంచనా వేయకూడదనే పాఠం మనం నేర్చుకోవాలన్నాడు. అంతటితో ఆగిపోయి మళ్లీ తన పని మొదలుపెట్టాడు. అయితే ఈ ఇష్యూను అక్కడితో క్లోజ్ చేయాలని అప్పటికే కెప్టెన్ జెస్సికాకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె మరోసారి సుందర్ దగ్గరికి వచ్చింది. తను చేసిన పనికి క్షమాపణ చెప్పింది. ఆ సమయంలో సుందర్ కొన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు. నేను చిన్నప్పుడు ఖరీదైన బట్టలు కొనగలిగే స్టేజ్‌లో లేను. ఇప్పుడు సీఈఓగా ఉన్నప్పుడు కూడా నాకు బట్టలనేవి కేవలం కంఫర్ట్ మాత్రమే అని నమ్ముతాను. అంతేకానీ నా డాబును చూపించుకోవడం కాదు. నీలానే చాలామంది నన్ను ఇలాగే అవమానించారు అంటూ ఆగాడు. అప్పటికే అందరూ ఆ సంభాషణను ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో సుందర్ ఆమెను ఓ ప్రశ్న అడిగాడు. చుట్టూ చూసి చెప్పు నీకు ఏం కనిపిస్తుంది అని ప్రశ్నించాడు. చాలామంది ఖరీదైన, డిజైనర్ దుస్తులు వేసుకున్నారు. దాన్నుంచి వారి సామర్ధ్యం, వారి వ్యక్తిత్వం ఏమైనా తెలుస్తున్నాయా అని అడిగాడు. ఆమె లేదన్నట్లు తలూపింది. ఇంతలో మరో ఫ్లైట్ అటెండెంట్ అక్కడకు వచ్చి ట్రూ క్లాస్ అంటే మనం ఏం ధరిస్తున్నామన్నది కాదా అని ప్రశ్నించింది. కాదు అంటూ షార్ప్‌గా బదులిచ్చాడు సుందర్. మనం ఎదుటివాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నాం, వారిని ఎలా గౌరవిస్తున్నాం, ఎలా అర్థం చేసుకున్నామన్నదే అసలైన క్లాస్ అన్నాడు. మేం గుగూల్‌లో బ్రిలియంట్ మైండ్స్ ఉంటాయి. రకరకాల బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినవారుంటారు. వారిలో కొందరు సూట్స్‌లో వస్తారు. ఇంకొందరు హుడీల్లో వస్తారు. వారి దుస్తులను బట్టి వారి సలహాలు తీసుకోం. ఇన్నోవేషన్ అనేది మీరు ఏం ధరిస్తున్నారన్నదాన్ని పట్టించుకోదు. మీ బ్రాండ్ లేబుల్‌ను బట్టి మీ ఐడియాకు విలువుండదు. మీరు ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నారన్నదానిబట్టి మీ విజయాన్ని లెక్కకట్టలేం అంటూ జీవిత సత్యాన్ని చాలా సున్నితంగా చెప్పాడు సుందర్. అప్పటికే జెస్సికా కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. 15ఏళ్ల తన సర్వీస్ తనకు ఏం నేర్పలేదని అర్థమైంది. అంతా తెలుసనుకున్న తనకు ఏమీ తెలియదన్న తత్వం బోధపడింది. ఇక నుంచి ఫస్ట్ క్లాస్ ట్రీట్‌మెంట్ వారి ఒంటిపై ఉన్న బట్టలను చూసి కాకుండా వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఇస్తానని ప్రామిస్ చేసింది. సుందర్ తన బ్యాగ్ నుంచి లీడర్‌షిప్ గురించి తాను రాసిన పుస్తకాన్ని తీసి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ విమానంలో ఉన్న వారంతా దాన్ని ఓ జర్నీగా కాకుండా ఓ క్లాస్‌రూమ్‌లా, తమ జీవితాలకు అత్యంత విలువైన పాఠంలా ఫీలయ్యారు. ఎవరికి వారు తమ సోషల్ మీడియాలో అందమైన పదాలతో సుందర్ పిచాయ్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అన్నింట్లో అర్థం ఒక్కటే సుందర్ పిచాయ్ ద రియల్ లీడర్. జర్నీ ముగిశాక ఆమెకు కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అయితే ఆమెకు శిక్ష వేయడానికి కాదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఓ ట్రైనింగ్ క్లాస్ ఆమెనే నిర్వహించమన్నారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆరునెలల తర్వాత గూగుల్ నుంచి ఆమెకు ఓ మెయిల్ వచ్చింది. ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడమని. అందులోనూ ఆమె తన అనుభవాన్ని వివరించింది. ఇప్పటికీ ఈ ఇష్యూ ఓ కార్పొరేట్ లెసన్‌గా మిగిలిపోయింది. [embed]https://www.youtube.com/watch?v=Er_eIyMpbP8[/embed]