Top story జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న బంగారం ధరలు ఏడాది చివరి నాటికి లక్ష మార్క్ దాటిపోతుందా ?

పసిడి రేట్లు పరుగులు పెడుతోంది. ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో...ఊహించని విధంగా పెరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2024 | 01:48 PMLast Updated on: Oct 26, 2024 | 1:48 PM

Top Story Gold Prices Are Rising With Jet Speed Will It Cross The Lakh Mark By The End Of The Year

పసిడి రేట్లు పరుగులు పెడుతోంది. ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో…ఊహించని విధంగా పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి 90వేలు దాటిపోతుందా ? పెరగడమే తప్పా తరగడం అన్న ఛాన్సే లేదా ? బంగారం రేట్లు ఎందుకిలా పెరుగుతున్నాయి ?

భారతీయులకు బంగారమంటే సెంటిమెంట్. బంగారానికి భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. డబ్బులు చేతిలో ఉంటే ఎంతో కొంత గోల్డ్ తీసుకోవాల్సిందే. పెళ్లిళ్లకైతే తులాల కొద్దీ కొనుగోలు చేయాల్సిందే. గోల్డ్ రేట్లు పెరుగుతున్నా…గ్రాముల్లో కాంప్రమైజ్ అవుతున్నారే తప్ప..కొనడంలో మాత్రం వెనుకంజ వేయడం లేదు. బంగారం ధరలు బులియన్ మార్కెట్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పాయి. 10 గ్రాముల పసిడి ధర 81,500కి చేరింది. వారం రోజుల్లోనే బంగారం సైతం 10 గ్రాములు దాదాపు రూ.2850 మేర హైక్ అయింది. ధన్ తెరాస్, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో బంగారానికి డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడడంతో బంగారం, వెండి కొనేందుకు సిద్ధమవుతున్న కస్టమర్లు…పెరిగిన ధరలు చూసి షాకవుతున్నారు. వారం రోజులుగా గోల్డ్ రేట్లు దూసుకెళ్లుతున్నాయి. 10 గ్రాములపై దాదాపు 3 వేల రూపాయలు పెరిగింది. ఈ మూడు రోజుల్లో 2 వేలు హైక్ అయింది. 21న బంగారం 10 గ్రాములు రూ.78,200 పలికింది. 22న 80వేల మార్క్ ని దాటింది. 23వ తేదీన ఆల్ టైమ్ హైకి చేరింది. ఢిల్లీలో తులం 81 వేల 5వందలు దాటింది. పెరుగుతున్న బంగారం ధరలను చూసి…ముక్కున వేలేసుకుంటున్నారు. కస్టమర్లే కాదు…వ్యాపారులు సైతం ఆల్ టైమ్ రికార్డు ధరల్ని చూసి షాకవుతున్నారు. ఆర్నెళ్లలోనే ఊహించనంతగా రేట్లు పెరిగాయంటున్నారు.

డిమాండ్-సప్లై మధ్య అంతరం పెరగడం, గనుల్లో ఉత్పత్తి పడిపోవడం, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండడం కూడా కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారంతా…ఇప్పుడు పసిడిపైనే ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. బంగారం..సురక్షితమైన పెట్టుబడి. లాంగ్ టర్మ్ గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. బంగారం అనేది కేవలం ఆభరణాల కోణంలోనే కాదు , పెట్టుబడిగానూ భావిస్తారు.ఇత‌ర పెట్టుబ‌డుల‌తో పోలిస్తే బంగారం రిస్క్‌లేని ఇన్వెస్ట్‌మెంట్. ఈక్విటీలు, ఇత‌ర పెట్టుబ‌డి ఆప్షన్ల‌తో పోలిస్తే బంగారం బెస్ట్. కొన్నేళ్లుగా పసిడి పరుగులు తీస్తూనే ఉంది. మధ్య మధ్యలో కొంత తగ్గినా…పెరుగుదలలో మాత్రం దూకుడు కొనసాగిస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్ తో పోటీ పడుతోంది బులియన్ మార్కెట్. పెరగడమే తప్ప..దిగనంటోంది పసిడి. సామాన్యులు, మిడిల్ క్లాస్ కు సైతం అందనంత ఎత్తుకు ఎగబాకింది. ప్రస్తుతం దీపావళి, ధన్‌తేరస్ వస్తుండటటంతో బంగారం రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదేవిధంగా పెరుగుతూ పోతే…ఈ ఏడాది చివరి నాటికి 90 వేలు లేదా లక్ష దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

మహిళలకు బంగారమంటే మక్కువ ఎక్కువ. ప్రతి పండగకూ గోల్డ్ కొనుక్కోవాలని భావిస్తారు. ముఖ్యంగా అక్షయ తృతీయ, ధన్ తేరస్, దీపావళి సమయాల్లో ఒక గ్రామైనా కొనుగోలు చేస్తారు. రేటు పెరుగుతూనే ఉన్నా కొనేవాళ్ల మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. సాధారణంగా భారత్‌లో వార్షిక బంగారం డిమాండ్‌ సుమారు 50 శాతం పెళ్లిళ్ల నుంచే వస్తుంది. ప్రపంచంలో ఏ రంగం పడిపోయినా…పసిడి ధరలు మాత్రం ఎప్పుడు తగ్గలేదు. గత ఏడు దశాబ్దాలుగా బంగారం ధరలను పరిశీలిస్తే…ఇదే చెబుతోంది. 1930లో తులం బంగారం ధర 18 రూపాయలు. ఇప్పుడు 81 వేలు దాటింది. ఈ ఏడాది చివరి నాటికి లక్ష అయినా ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదు. 2వేల సంవత్సరంలో గోల్డ్ రేట్ రూ.4400…2024లో 81 వేలు. 24 ఏళ్లలోనే బంగారం ధర 77 వేలు పెరిగింది. ప్రతి తొమ్మిదేళ్లకోసారి పసిడి ధర మూడు రెట్లు రెట్టింపవుతోంది. 2000 సంవత్సరంలో పసిడి ధర 4,400గా ఉంది. 2002 వరకు స్వల్పంగా పెరిగింది. పది గ్రాములు 4వేల 900కి చేరింది. 2003లో రూ.5,600, 2004లో 5,850 , 2005లో 7వేలు పలికింది. 2007లో 10,800 రూపాయలు చేరింది. ఏడేళ్లలోనే 6 వేల 4 వందల రూపాయలు పెరిగింది. 2015 వరకు రూ.24,740 అయింది. 2023 దాకా 3 రేట్లు పెరిగింది. ఈ ఏడాది ఏకంగా 81 వేల మార్క్ దాటింది. గత ఏడాదితో పోల్చితే బంగారం ఏకంగా 10 వేలకుపైగా పెరిగింది. 2022లో 63,350 పలికితే…ఏడాది తిరిగే సరికి 68,720 పలికింది. తొమ్మిదేళ్ల క్రితం తులం 45 వేల 410 రూపాయలు ఉంది. అంటే 36 వేలు పెరిగిందన్నమాట.

కొన్నాళ్లుగా బంగారం నిజంగానే భయపెడుతోంది. పైపైకి ఎగబాకుతూ రికార్డ్ స్థాయికి చేరుతోంది. ఆల్ టైమ్ హైలను టచ్ చేస్తోంది. దీంతో బంగారం కొనాలనకునే వారు కంగారు పడాల్సిన పరిస్థితులున్నాయి. బంగారాన్ని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల పసిడి 81 వేలు క్రాస్ చేసింది. తులం కొనుగోలు చేస్తే…జీఎస్టీ అదనంగా చెల్లించాలి. మజూరీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే తప్పకుండా బంగారం ఆభరణాలు ధరిస్తుంటారు. అలాంటి బంగారం ధరలు రోజు రోజుకు పెరగడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడున్న పరిణామాల దృష్ట్యా బంగారాన్ని కొనడానికి ఇది మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తే వచ్చే వడ్డీరేట్లు చాలా తక్కువ. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదోక కారణం. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులతో బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది.