Top story : వెడ్డింగ్ కార్డు పేరుతో కొత్త రకం మోసాలు, వాట్సాప్ కు ఏపీకే ఫైల్ పంపి ఖాతా ఖాళీ

గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు వచ్చిందా ? తెలిసిన వారే పంపి ఉంటారని భావిస్తున్నారా ? లేదంటే ఏదైనా ఇన్విటేషన్ కార్డు...మీ మొబైల్ కు వచ్చిందా ? తస్మాత్ జాగ్రత్త.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2024 | 01:18 PMLast Updated on: Nov 19, 2024 | 1:18 PM

Top Story New Type Of Fraud In The Name Of Wedding Card Sending Apk File To Whatsapp And Emptying Account

గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు వచ్చిందా ? తెలిసిన వారే పంపి ఉంటారని భావిస్తున్నారా ? లేదంటే ఏదైనా ఇన్విటేషన్ కార్డు…మీ మొబైల్ కు వచ్చిందా ? తస్మాత్ జాగ్రత్త. వెడ్డింగ్ కార్డు, ఇన్విటేషన్ కార్డు…వస్తే ముందు వెనుక ఆలోచించకుండా ఓపెన్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త. గుర్తు తెలియని వ్యక్తులు పంపే మ్యారేజ్ ఇన్విటేషన్ మేసేజ్ లను ఓపెన్ చేశారో…మీ ఖాతా ఖాళీ కావడం ఖాయం. అదెలా అనుకుంటున్నారా ? ఈ స్టోరీని చూసేయండి.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ…కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ కేటుగాళ్లు…రోజుకో కొత్త యాంగిల్ లో మోసాలకు పాల్పడుతున్నారు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్ తో…జనం ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. చేతికి మట్టి అంటకుండా…కూర్చున్న చోటే లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఇంట్లో పెళ్లి వేడుక ఉంటే…బంధువులు, సన్నిహితులు ఎంత దూరం ఉన్న ఆహ్వాన పత్రికలు పంచేవారు. వివాహానికి కచ్చితంగా రావాలని కార్డు ఇవ్వడమే కాదు…ఒక రోజు ముందే రావాలని పదే పదే కచ్చితంగా రావాలని చెప్పేవారు. కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి. డిజిటల్ యుగంలో అన్ని క్షణాల్లో జరిగిపోతున్నాయి. సమాచారం సెకన్లలో చేరిపోతోంది. టెక్నాలజీ యుగంలో ట్రెండ్​ మారింది. డిజిటల్‌ పత్రికలు, వీడియోలు, వేడుక జరిగే లొకేషన్…అన్ని వివరాలతో ప్రత్యేక కార్డును తయారు చేస్తున్నారు. దాన్నే బంధువులు, తెలిసిన వారు, సన్నిహితులు వాట్సాప్ లో పంపుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది పెళ్లి ఆహ్వానాలు పంపుతున్నారు. ఖర్చు తగ్గడం…టైమ్ ఆదా కావడంతోనే అందరూ దీన్నే ఫాలో అయిపోతున్నారు.

2024 కార్తీక మాసంలో లక్షల కొద్దీ పెళ్ళిళ్ళు ఖాయం అయ్యాయి. ఈ నెల 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. దీన్నే సైబర్ కేటుగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పెళ్లికార్డు పేరుతో ఫోన్​కు సందేశాలు, ఏపీకే ఫైళ్లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలకు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుర్తుతెలియని నంబర్లు, ఖాతాల నుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్​ లకు ఆహ్వాన పత్రికలు, వీడియోలు, లింకులు, డాక్యుమెంట్లు, ఫైళ్లను సైబర్ కేటుగాళ్లు పంపుతున్నారు. బంధువులో…తెలిసిన
వారో….సన్నిహితులో…కార్డు పంపారని భావించి…క్లిక్ చేస్తే అంతే ఇక సంగతులు. మనకు సంబంధం లేకుండానే…మన ఫోన్​లోకి ఏపీకే ఫైల్‌ రూపంలో ఉండే యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఫోన్​ గ్యాలరీ, యాప్​లలోని డేటాతో సహా…మన ఫోన్ లో ఉన్న సమాచారం మొత్తాన్ని…ఈ మాల్​వేర్​ లాగేసుకుంటుంది. ఇలా డిజిటల్‌ వెడ్డింగ్‌ కార్డులు, వీడియోలు..డౌన్‌లోడ్‌ చేస్తే ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ యాప్‌లు మన ఫోన్ లోకి ఇన్‌స్టాల్‌ అవుతాయి. ఆ తర్వాత మన ఫోన్ సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఫోన్‌ హ్యాక్‌ అవుతుంది.

ఎందుకు ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకునేలోపే…జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సైబర్ కేటుగాళ్లు మొబైల్​ ఫోన్​ను…తమ కంట్రోల్ లోకి తీసుకొని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోన్​, కంప్యూటర్‌లోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడిప్పుడే డిజిటల్‌ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త ఫోన్​ నంబర్ల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, లింకులు క్లిక్​ చేయొద్దని, వాటిని డౌన్​లోడ్​ చేసుకోవద్దని సూచిస్తున్నారు. సైబర్​ నేరగాళ్లు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌, వీడియోలు, లింకుల విషయంలో జనం జాగ్రత్త ఉండాలని చెబుతున్నారు. వెడ్డింగ్ కార్డ్స్ లేదా ఇతర ఇన్విటేషన్ కార్డులు…ఏపీకే ఫైల్స్ రూపంలో వస్తే…ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.