Top story; భర్త ఇల్లీగల్ ఎఫైరే వెంకటమాధవి హత్యకు కారణమా ? గురుమూర్తి ఫోన్ లో ఉన్న ఆ మహిళ ఎవరు ?
వివాహేతర సంబంధాలు...పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో...చిన్నారులు దిక్కులేని వారవుతున్నారు. కుటుంబాలకే కుటుంబాలే చిన్నాభిన్నం అవుతున్నాయి.
వివాహేతర సంబంధాలు…పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో…చిన్నారులు దిక్కులేని వారవుతున్నారు. కుటుంబాలకే కుటుంబాలే చిన్నాభిన్నం అవుతున్నాయి. నిమిషాల సుఖానికి…జీవితాంతంగా జైలు జీవితం గడుపుతున్నారు. అటు కన్న వారితో…ఇటు పుట్టిన పిల్లలతో ఛీ కొట్టించుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే భార్య వెంకట మాధవిని గురుమూర్తి హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. నిందితుడు వెంకట మాధవిని హత్య చేసినట్లు చెప్పినా, దానికి సంబంధించి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురుమూర్తి చెప్పిన విషయాలపై ఆధారపడకుండా…వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే…మాధవి హత్యకు దారి తీసినట్లు విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని మాయం చేసి…హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు పథకం రచించాడు. ఓటీటీల్లో వచ్చే క్రైమ్ సిరీస్ లను చూసి…ఇన్ స్పైర్ అయ్యాడు గురుమూర్తి.
నిందితుడు గురుమూర్తి ఫోన్ స్వాధీనం చేసుకొని…పరిశీలించడంతో సంచలన అంశాలు బయట పడ్డాయి. మరో మహిళ ఫొటోలు కొన్ని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 18న నమోదు చేసిన వెంకటమాధవి అదృశ్యం కేసును…హత్య కేసుగా మారుస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా…గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటి దగ్గర వదిలి వచ్చాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకుని సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉండాలని భావించాడు. అదను కోసం ఎదురు చూస్తున్నాడు.
కనుమ రోజు ఉదయం భర్త మరో మహిళతో కలిసి ఉన్న ఫోటోలను చూసిన మాధవి…ఆగ్రహంతో రగిలిపోయింది. దీనిపై గురుమూర్తిని ప్రశ్నించింది. గురుమూర్తికి భార్య వెంకటమాధవితో చిన్న గొడవ మొదలైంది. అది పెద్దదవడంతో రగిలిపోయాడు గురుమూర్తి. అప్పటికే భార్య అడ్డు తొలగించుకోవాలని కసితో రగిలిపోతున్నాడు. పిల్లలు ఇంట్లో లేకపోవడంతో…ఇదే అదనుగా భార్యను తలమీద కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత ప్రాణం పోయేంత వరకు…కొట్టాడు. ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన వెబ్‌సిరీస్‌లోని పాత్రల తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికాడు.
రెండ్రోజులు నిద్ర పోకుండా…శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. బకెట్ నీళ్లను హీటర్‌తో వేడి చేసి…అందులో బాగా ఉడికించాడు. ముక్కలు మొత్తగా మారిపోయాక మాంసాన్ని ఎముకల నుంచి వేరు చేశాడు. మాంసానని మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దలుగా తయారు చేశాడు. ఎముకల్ని ముక్కలుగా చేసి అంతా సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు రెండ్రోజులు నిద్రలేకుండా…మద్యం తాగుతూ పైశాచికిత్వానికి పాల్పినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించిన క్లూస్‌టీం, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్‌తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించాయి. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. బకెట్‌లో వేసి శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.